25/06/2022
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి ఘట్టం. ప్రజాస్వామ్య పునాదులను కదలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగా వ్యవహరించిన తీరు, ఆ నియంతృత్వ విధానాలను ఎదిరించి తిరిగి ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టాలకు ఎక్కించిన ఘనత దేశ ప్రజలదే. 1975, జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించగా, 1977 మార్చ్ 21 అర్ధరాత్రి రద్దు చేయబడింది. సుమారు 21 నెలలపాటు కొనసాగిన ఆ కాలఖండంలో అనేక వేలమంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు నిర్బంధించబడ్డారు. సుమారు లక్షా పాతికవేలమంది జైలుపాలు కాగా, అందులో 90 శాతం మంది ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలే.
ఎమెర్జెన్సీ సమయంలో నియంత ఇందిరాగాంధీ తన ప్రత్యర్ధులను జైలుపాలు చేయడంతోపాటు ప్రజాస్వామ్య హక్కులను హరించివేసింది. రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులు హరించివేయబడ్డాయి. ప్రచార, ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు అమలయ్యాయి. పత్రికలపై ముందస్తు సెన్సార్ షిప్ ప్రవేశపెట్టారు. ఏ వార్త అయినా సంబంధిత ప్రభుత్వ అధికారి ఆమోదిస్తే తప్ప ప్రచురణకు నోచుకోని పరిస్థితి నెలకొంది. ఆర్ ఎస్ ఎస్ తో సహా అనేక సంస్థలను నిషేధించారు. క్రమశిక్షణ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలు, నిఘా మొదలైంది. నియంత ఇందిరాగాంధీ, ఆమె పాలనకు వ్యతిరేకంగా ఏ చిన్న వ్యాఖ్య చేసినా అరెస్ట్ చేసి జైలులో పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ పెత్తనం నడిచింది. నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగాయి. రహదారుల విస్తరణ పేరుతో ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేశారు. ఇలా అంతటా నిర్బంధ విధానాలు కొనసాగాయి.
అయితే ఈ పరిణామాలతో సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురైనప్పటికీ, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, ఆర్ ఎస్ ఎస్ వంటి స్వచ్ఛంద సంస్థలు మౌనంగా ఊరుకోలేదు. ఇందిరా నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా అజ్ఞాత ఉద్యమాన్ని నిర్వహించాయి. ప్రభుత్వ అవకతవక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చాయి. అనేక వేలమందిని నిర్బంధించినప్పటికీ దేశవ్యాప్తంగా అజ్ఞాత ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమానికి నేతృత్వం వహించి, సమన్వయంతో విజయవంతమైన పోరాటం కొనసాగించిన ఘనత ఒక్క ఆర్ ఎస్ ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)కె దక్కుతుంది.
ఎమర్జెన్సీ ప్రకటించి నెలరోజులు పూర్తైనప్పుడు 1975 జులై 26న ఆర్ ఎస్ ఎస్ దేశవ్యాప్తంగా వ్యక్తిగత సత్యాగ్రహాలు, గంటానాదాల కార్యక్రమాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో గంటలు మ్రోగించడం ద్వారా ప్రజలు తమ నిరసన త