25/10/2017
🗣🚩✨➖➖➖➖➖➖➖➖
*"కర్మభూమిలో పూసిన ఓ పువ్వా.. విరిసీ విరియ ని ఓ చిరునవ్వా.." అనేపాటతో మహిళా ఔన్నత్యాన్ని చాటిన గొప్ప విప్లవ కారుడు కలేకూరి ప్రసాద్ జయంతి నేడు..*
➖➖➖➖➖➖➖➖🌸🌸🍃
*̀✧ (యువక) ప్రముఖ కవి, సినీగీత రచయిత, సాహితీ విమర్శకు డు, మార్క్సిస్టు విశ్లేషకుడు, దళిత ఉద్యమ కారుడు. జననాట్యమండలి, విప్లవ రచయితల సంఘం లో పనిచేశారు.*
*🔘జీవిత విశేషాలు🔘*
*ㅁప్రసాద్ 1964 అక్టోబర్ 25వ తేదీన కృష్ణాజిల్లా, కంచికచెర్లలో జన్మించాడు. ఆయనతల్లితండ్రులు లలితా సరోజిని, శ్రీనివాస రావులు ఇద్దరూ ఉపాధ్యాయులే.*
*ㅁకలేకూరి ప్రసాద్ తమ గ్రామంలో కంచికచర్ల కోటేశు అనే యువకుడ్ని పెత్తందార్లు సజీవదహనం చేయడం తో చలించిపోయి పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరారు. పార్టీ రాజకీయ పాఠశాలల్లో బోధకుడిగా పనిచేశారు. కారంచేడులో దళితుల మారణ కాండతో దళిత ఉద్యమాల్లో పనిచేశారు.*
*ㅁశ్రీరాములయ్య సినిమాలో వాడిన భూమికి పచ్చాని రంగేసినట్లు అమ్మ లాలో.. పాట కారంచేడును ఉద్దేశించి రాసినదే. అదే సమయంలో పీపుల్స్‌వార్ నుంచి విభేదించి బయటకు వచ్చిన కె.జి.సత్యమూర్తి వంటి నాయకులతో కలిసి జిల్లాలో జరిగిన పలు ప్రజా, దళిత ఉద్యమాల్లో పనిచేశారు.*
*ㅁటంగుటూరులోనవవధువు ఇందిర హత్యకు గురైన సమయం లో ఆయన రాసిన "కర్మభూమిలో పూసిన ఓ పువ్వా.. విరిసీ విరియని ఓ చిరునవ్వా.." పాట రాసి మహిళా ఉద్యమానికి వూపిరిలూ దారు.*
*ㅁడర్బన్‌లో జాతి వివక్షపై జరిగిన చారిత్రక అంతర్జాతీయ సదస్సులో కలేకూరి పాల్గొన్నారు. అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో సైతం తన ఉపన్యాసాన్ని ఆసక్తిగా విన్నారని కలేకూరి పలు సందర్భాల్లో చెప్పేవారు.*
*ㅁ'యువక 'అనే కలం పేరుతో కలేకూరి ప్రసాద్ రాసిన కవితలు ఎంతోమందిని కదిలించాయి. మండుతున్న చుండూరు, దళిత కవిత్వం లాంటి కవితా సంకలనా ల్లో ఆయన కవితలు చోటుచేసుకు న్నాయి. ప్రసాద్ రాసిన పాటలను పలు చిత్రాలకు ఉపయోగించు కున్నారు.*
*◎ 'కర్మభూమిలో పూచిన ఓ పువ్వా'..*
*◎ 'భూమికి పచ్చాని రంగేసినట్టూ..'*
*◎ 'చిన్ని చిన్ని ఆశలే చిందులేయగా'* తదితర గీతాలు బహు ప్రాచుర్యం పొందాయి.
*ㅁఉద్యమ అవసరాల కోసం పలు పత్రికలకు సంపాదకత్వం వహించా రు. ఇంగ్లీష్ భాషపై మంచి పట్టున్న ఆయన విదేశీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. స్వామి ధర్మతీర్థ,సురేష్ కట్టా రచించిన హిందూ సామ్రాజ్యవాద చరిత్ర పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చారు. ఆ అనువాదం దాదాపు పది ముద్రణ లు పొందింది. తెలుగులోరాచమల్లు రామచంద్రా రెడ్డి తర్వాత ఆ స్థాయిలో అనువాదాలు చేసిన ఘనత కలేకూరికే దక్కుతుంది.*
*ㅁకొంతకాలం సబ్ ఎడిటర్‌గానూ పనిచేశారు. చిలకలూరిపేట బస్సు ఘటనలో ఉరిశిక్ష పడిన చలపతి, విజయవర్ధనం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ విప్లవ దళిత కవి శివసాగర్‌తో కలిసి పాల్గొన్నారు.*
*🔘ధిక్కార పతాక కలేకూరి🚩*
*ㅁనేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ వేలఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదనే చంపబడ్డాను. తనెవరో, తన మూలాలే మిటో గుర్తించిన ఒక మూలవాసి చేసిన సాధికార ప్రకటన ఇది. పిడికెడు ఆత్మ గౌరవం కోసం, తనదైన జీవితం కోసం మరణం గొంతు మీద కాలేసి నిలదీసిన వైనమిది.*
*ㅁకవిగా, కార్యకర్తగా నాయకుడిగా, గాయకుడి గా, విమర్శకుడిగా, అనువాద కుడి గా, పాత్రికేయుడు గా, మధుపాత్రికేయుడగా, ప్రేమికుడి గా, కాముకుడిగా, సాయుధుడుగా, నిరాయు ధుడుగా ఒక కొత్త రూపాన్ని ఆవిష్కరించు కుంటూ పోయిన బహురూపి. సిద్ధాంత పరంగా విప్లవవాదిగా మొదలై దళిత వాదిగా కొనసాగాడు మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని రెండు కళ్ళు చేసుకుని దృష్టికోణా న్ని విస్తరించుకున్నాడు.*
*ㅁబాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్ట్ డైరెక్టర్ (మహబూబ్‌నగర్) గా, సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ సంచాలకుడుగా, స్వచ్ఛంద సంస్థలకు సలహాదారుడుగా ఎన్నో పాత్రలు నిర్వహిం చాడు. ఎక్కడా కుదురుగా నిలవకపోవడం అతని ప్రత్యేకత.అతను స్వేచ్ఛావాది అరాచక వాది. ఒక మూసలో ఇమిడేరకం కాదు. బంధాలకు, అనుబంధాలకు, సంకెళ్ళకు, ప్రేమలకు, పెళ్ళిళ్లకు, స్నేహాలకు, దేహాలకు చిక్కినట్టే చిక్కి లిప్తపాటులో తప్పించుకుపో గల అపర పాపియాన్.*
*◎ కలేకూరు ప్రసాద్ 2013 మే 17 న ఒంగోలు లో మరణించారు.*
🍃🌸🤗🌸🍃