ALP Infra Projects

ALP Infra Projects Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ALP Infra Projects, Estate agents, Madhapur, Madhapur.

🏡 Welcome to ALP Infra Projects - Your Trusted Real Estate Partner in Hyderabad! 🌟 Discover HMDA, DTCP, and RERA approved open plots, flats, villas, and farm lands. 🌆 Explore modern living, luxury villas, and serene farm lands.

08/08/2023
06/06/2023

GENERAL MEASUREMENTS OF LAND
1) ఒక ఎకరాకు = 40 గుంటలు.
2) ఒక ఎకరాకు = 4840 Sq. Yards.
3) ఒక ఎకరాకు = 43,560 Sft.
4) ఒక గుంటకు = 121 Sq. Yards
5) ఒక గుంటకు = 1089 Sft.
6) ఒక స్క్వయర్ యార్డ్ కు 3 x 3 = 09 చదరపు ఫీట్లు.
7) 121 x 09 = 1089 Sft.
8) 4840 Syd x 09 = 43,560 Sft.
9) ఒక సెంట్ కు = 48.4 Sq. Yards
10) ఒక సెంట్ కు = 435.6 Sft.

Common Terminology in Revenue Department

గ్రామ కంఠం :-
గ్రామంలో నివసించేందుకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.

అసైన్డ్‌భూమి :-
భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.

ఆయకట్టు :-
ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.

బంజరు భూమి (బంచరామి) :-
గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.

అగ్రహారం :-
పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.

దేవళ్‌ ఇనాం :-
దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.

అడంగల్‌ (పహాణీ) :-
గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.

తరి :- సాగు భూమి.

ఖుష్కీ :- మెట్ట ప్రాంతం.

గెట్టు :- పొలం హద్దు.

కౌల్దార్‌ :- భూమిని కౌలుకు తీసకునేవాడు.

కమతం :- భూమి విస్తీర్ణం.

ఇలాకా :- ప్రాంతం.

ఇనాం :-
సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి.

బాలోతా ఇనాం :-
భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి.

సర్ఫేఖాస్‌ :-
నిజాం నవాబు సొంత భూమి

సీలింగ్‌ :-
భూ గరిష్ఠ పరిమితి

సర్వే నంబర్‌ :-
భూముల గుర్తింపు కోసం కేటాయించేది.

నక్షా :-
భూముల వివరాలు తెలిపే చిత్రపటం.

కబ్జాదార్‌ :-
భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి.

ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) :-
భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్‌ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.

ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ (ఎఫ్‌ఎంబీ) బుక్‌ :-
దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.

బందో బస్తు :-
వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.

బీ మెమో :-
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.

పోరంబోకు :-
భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.

ఫైసల్‌ పట్టీ :-
బదిలీ రిజిస్టర్‌.

చౌఫస్లా :-
ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.

డైగ్లాట్‌ :-
తెలుగు, ఇంగ్లిఫ్‌ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్‌.

విరాసత్‌/ఫౌతి :-
భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.

కాస్తు :-
సాగు చేయడం.

మింజుములే :-
మొత్తం భూమి.

మార్ట్‌గేజ్‌ :-
రుణం కోసం భూమిని కుదవపెట్టడం.

మోకా :-
క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్‌).

పట్టాదారు పాస్‌ పుస్తకం :-
రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.

టైటిల్‌ డీడ్‌ :-
భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.

ఆర్వోఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌) :-
భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్‌.

ఆర్‌ఎస్సార్‌ :-
రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ లేదా శాశ్వత ఏ రిజిస్టర్‌.

పర్మినెంట్‌ రిజిస్టర్‌ :-
సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్‌. సేత్వార్‌ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.

సేత్వార్‌ :-
రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్‌. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.

సాదాబైనామా :-
భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.

దస్తావేజు :-
భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.

ఎకరం :- భూమి విస్తీర్ణం కొలమానం.
4840 చదరపు గజాల స్థలంగానీ,
100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ,
40 గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు,
తెలంగాణలో గుంట అని అంటారు.

అబి :-
వానకాలం పంట.

ఆబాది :-
గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు.

అసైన్‌మెంట్‌ :-
ప్రత్యేకంగాకేటాయంచిన భూమి.

శిఖం :-
చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం.

బేవార్స్‌ :-
హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.

దో ఫసల్‌ :-
రెండు పంటలు పండే భూమి.

ఫసలీ :-
జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.

నాలా :-
వ్యవసాయేతర భూమి.

ఇస్తిఫా భూమి :-
పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి.

ఇనాం దస్తర్‌దాన్‌ :-
పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి.

ఖాస్రాపహానీ :-
ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.

గైరాన్‌ :-
సామాజిక పోరంబోకు.

యేక్‌రార్‌నామా :-
ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం.

*🎙️అదిగదిగో యాద్రాది**🔹రేపటి నుంచే లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శనం**♦️అబ్బురపడే రీతిలో రూపుదిద్దుకున్న ఆలయం**🔹వందల ఏళ...
27/03/2022

*🎙️అదిగదిగో యాద్రాది*

*🔹రేపటి నుంచే లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శనం*

*♦️అబ్బురపడే రీతిలో రూపుదిద్దుకున్న ఆలయం*

*🔹వందల ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో కృష్ణశిలలతో నిర్మాణం*

*🔹కనువిందు చేస్తున్న అద్భుత శిల్పాలు*

*🔸మరో తిరుమల స్థాయిలో భక్తజనం వస్తారనే అంచనాలు*

*🔸రోజుకు 50 వేల మంది వచ్చినా ఇబ్బందిలేకుండా వసతులు*

*♦️సాక్షి, హైదరాబాద్‌: యాదగిరి లక్ష్మీ నారసింహుడు..*

*🏵️తెలంగాణ ఇలవేల్పు..*
*ఏడాదికోసారైనా ఇంటిల్లిపాదీ 'గుట్ట'కు వెళ్లి దర్శించుకోవటం ఆనవాయితీ. ఇప్పుడా నారసింహుడి ఆలయం అద్భుతమైన 'యాదాద్రి'గా మారి వెలుగులు విరజిమ్ముతోంది. పూర్తి కృష్ణశిలల నిర్మాణం, అబ్బురపడే శిల్పాలతో సరికొత్త రూపాన్ని సంతరించుకుని.. భక్తజన కోటిని ఆనంద పారవశ్యంలో ముంచెత్తేందుకు సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత భక్తులకు స్వయంభూ లక్ష్మీనరసింహుడు తనివితీరా దర్శనమివ్వనున్నాడు*

*♦️సోమవారం (28వ తేదీన) మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన తర్వాత సాధారణ భక్తులకు దర్శనం మొదలుకానుంది*

*🏵️మరో తిరుమలగా..!*

*🏵️ఏపీలోని తిరుమల వెంకన్న సన్నిధి నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. సాధారణ రోజుల్లోనే 40 వేల మంది వరకు.. సెలవులు, ప్రత్యేక పర్వదినాల్లో దాదాపు 70- 80 వేల మంది దాకా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధి తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తర్వాత అంతగా భక్తుల తాకిడి ఉండే ఆలయంగా నిలుస్తుందని అంచనా. గత ఆరేళ్లలో బాలాలయంలో నరసింహస్వామిని.. సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 30, 40 వేల వరకు దర్శించుకున్నారు. ఇప్పుడు ప్రధానాలయం, స్వయంభూ మూర్తి దర్శనం మొదలైతే.. భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు*

*♦️సాధారణ రోజుల్లో 20వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 40, 50వేల మంది వరకు వస్తారని పేర్కొంటున్నారు. ''ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలవకముందటితో పోలిస్తే.. పనులు మొదలై బాలాలయంలో స్వామి దర్శనాలు మొదలుపెట్టాక అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరిగింది. 5 వేల మంది దర్శించుకునే రోజుల్లో 10 వేల మంది రావడం మొదలైంది. ప్రత్యేక సందర్భాల్లో 30వేల మంది వరకు వచ్చారు. కొత్త ఆలయ నిర్మాణంతో దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. భక్తులు, సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నాం. రోజుకు 50వేల మంది వచ్చినా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం'' అని యాదాద్రి ప్రాంత అభివృద్ధి సంస్థ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు చెప్పారు*

*🔸వెయ్యేళ్లకుపైగా నిలిచేలా.*

*♦️యాదాద్రి ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించారు. నిజానికి 17వ శతాబ్దం తర్వాత రాతి నిర్మాణాలు చాలావరకు నిలిచిపోయాయి. ఇటుకలు, ఆ తర్వాత సిమెంటు వాడకం పెరిగి రాతిని వాడటం ఇబ్బందిగా భావిస్తూ వచ్చారు. జటప్రోలు సంస్థానాధీశులు నిర్మించినవే తెలుగు నేలపై చివరి పూర్తి రాతి మందిరాలు. ఇన్ని వందల ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారి పూర్తి రాతి నిర్మాణానికి యాదాద్రి వేదికైంది. ఆలయం కోసం ఏకంగా రెండున్నర లక్షల టన్నుల కృష్ణ శిలలను వినియోగించారు. 1,200 మంది శిల్పులు రాత్రింబవళ్లు పనిచేసి అద్భుతంగా తీర్చిదిద్దారు. వెయ్యేళ్ల పాటు నిలిచేలా ఇంటర్‌లాకింగ్‌ పరిజ్ఞానం, బరువు సమతూకం అయ్యేలా డిజైన్‌ చేసి ఆలయాన్ని నిర్మించారు. పిడుగుపాటుతో నష్టం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు*

*♦️ప్రధానాలయ విమానగోపురంపై సీఎం కేసీఆర్‌ సంప్రోక్షణ చేయనున్న నేపథ్యంలో ప్రత్యేకాలంకరణలో ఏర్పాటు చేసిన రంగురంగుల ధ్వజాలు*

*🏵️అద్భుత శైలి.. ఆకట్టుకునే విగ్రహాలతో..*

*🏵️సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో దాదాపు రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో యాదాద్రి పునర్నిర్మాణాన్ని చేపట్టారు. 2015లో మొదలైన నిర్మాణం ఇటీవలే పూర్తయింది. అబ్బురపడే రీతిలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఓ రకంగా చెప్పాలంటే గుడి కాదు ఏకంగా గుట్టనే మారిపోయింది*

*► యాదాద్రి ఆలయ నిర్మాణంలో కాకతీయ, చోళ, చాళుక్య, పల్లవ..*
*ఇలా ఎన్నో అద్భుత నిర్మాణ శైలులను వినియోగించారు.*

*► వైష్ణవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆళ్వార్లు ఇక్కడ రాతి స్తంభాల రూపంలో ముఖ మండపంలో కొలువుదీరారు. 12 మంది ఆళ్వార్లు 11 అడుగుల ఎత్తుతో 38 అడుగుల ఎత్తున్న ముఖ మండపానికి ఆధారభూతంగా నిలిచారు*

*► మరెక్కడా లేనట్టుగా 1,700 అడుగుల పొడవునా.. దాదాపు 80 నుంచి 100 అడుగుల ఎత్తుతో ప్రాకారాలను నిర్మించారు*

*► 84 అడుగుల ఎత్తుతో ఏడు అంతస్తుల మహారాజగోపురం..*
*ఐదు, నాలుగు, మూడు, రెండు అంతస్తులతో మరో ఐదు గోపురాలు, విమాన గోపురం ఇక్కడి మరో ప్రత్యేకత*

*► మహారాజగోపురం ఒక్కదానికే ఏకంగా 13 వేల టన్నుల రాయిని వాడారు. ఇది పూర్తవటానికి రెండేళ్లు పట్టింది*

*► ఏ దేవాలయంలోనూ లేనట్టు ప్రాకారానికి వెలుపల అష్టభుజి మండపాలను ఏర్పాటు చేశారు. రథయాత్ర సాగినా భక్తులు హాయిగా ఆ మండపాల్లో కూర్చుని చూడొచ్చు*

*► సింహం తల, గుర్రం తరహా శరీరం, దిగువ ఏనుగు.. వెరసి యాలీ జంతు రూపం. ఇలాంటి భారీ రాతి శిల్పాలు ఏకంగా 58 కొలువుదీరాయి. నోరు తెరిచి ఉన్నట్టుగా ఉండే ఆ విగ్రహాల నోటిలో అతిపెద్ద రాతి బంతులు ఉండటం విశేషం.*

*► ఏడు చోట్ల ఐరావతాలు, ప్రవేశం నుంచి ఆలయంలోకి వెళ్లేప్పుడు స్తంభాల రూపంలో ఆంజనేయుడు, ప్రహ్లాదుడు, యాద మహర్షి, రామానుజుల రూపాలు, గర్భాలయ ద్వారంపైన రాతి ప్యానెల్‌పై గర్భాలయ ఉత్సవ మూర్తి రూపం, ప్రహ్లాదచరిత్ర, పంచ నారసింహుల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.*

*► సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించినట్టుగా అదేతరహా కాంతితో ప్రత్యేక లైటింగ్‌ వ్యవస్థ ఆకట్టుకుంటోంది.*

*♦️ఇది ఓ తంజావూరు.. ఓ శ్రీరంగం*
*గొప్ప రాతినిర్మాణ దేవాలయం అనగానే మనకు తంజావూరు గోపురం గుర్తుకొస్తుంది. శ్రీరంగం మదిలో మెదులుతుంది. ఇప్పుడా* *రెండు దేవాలయాలు మనకు యాదాద్రిలో కనిపిస్తాయి. ఇది అసాధారణ నిర్మాణం. సీఎం కేసీఆర్‌ శ్రీకృష్ణదేవరాయలులాగా నిలిచి, ఆలోచనలు పంచి, ఆర్థిక వనరులు కల్పించి కట్టించారు*

*🔸రాతి దేవాలయాల నిర్మాణ చరిత్రలో యాదాద్రి చిరకాలం నిలిచిపోతుంది. భక్తులకు ఆధ్యాత్మిక పరిమళాలతోపాటు గొప్ప నిర్మాణంలో గడిపిన అనుభూతిని పంచుతుంది*

*- ఆనంద సాయి, ఆలయ ఆర్కిటెక్ట్‌*

20/02/2022

♦️రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలి అనుకునేవారికి సువర్ణ అవకాశం.
♦️మంచి ఆదాయం సంపాదించుకునే అవకాశం.
విద్య, అర్హత, అనుభవం అవసరం లేదు.
♦️విద్యార్థులు, నిరుద్యోగులు, గృహిణులు, ఉద్యోగులు మరియు రిటైర్మెంట్ అయిన వారికి మంచి అవకాశం.
♦️తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవాలనే పట్టుదల ఉన్నవారు సంప్రదించండి.

Prasad
9848283239

10/01/2022

Do you want to join our creative marketing team as a manager? If you are passionate about real estate sales and have a good understanding of the real estate industry, want to work and earn more. We'd really like to meet you! We offer a lively workspace and appealing benefits to you.
Join us now!
Watsup / Call us : +91 9848283239

Send a message to learn more

*యాదాద్రి యాదగిరిగుట్ట పక్కన 3⭐⭐⭐ ప్రాజెక్ట్*💶 *Excellent Rental income Opportunity* 💶✴First time in Yadadri Temple *3 S...
07/01/2022

*యాదాద్రి యాదగిరిగుట్ట పక్కన 3⭐⭐⭐ ప్రాజెక్ట్*

💶 *Excellent Rental income Opportunity* 💶
✴First time in Yadadri Temple
*3 Star Hotel Suite Rooms*
is going to construct 1BHK & 2BHK
✴1 BHK Suite for *21 lacs* only
Monthly rental income *19,250/-** per month
✴2 BHK Suite for *32 lacs* only
Monthly rental income *27,000/-** per month
💢Bank Loan also Available 💢
🙏For more information contact me 🙏
☎️ *9848283239*
🌸 *అద్భుతమైన అవకాశం*🌸 గ్యారెంటీ మరియు బోనస్ లాభం తీసుకోండి👍🏻🙏💐
💴 *మంచి ఆదాయం* 💴
✴మొట్టమొదటిసారి యాదగిరిగుట్ట దగ్గర
*3 స్టార్ రేంజ్ హోటల్* నిర్మాణం జరుగుతున్నది
1BHK మరియు 2BHK సూట్ అమ్మడానికి ఉన్నవి
✴1BHK సూట్ ధర కేవలం *21 లక్షలు* మాత్రమే నెలకు ఆదాయం *19,250/-**
✴2BHK సూట్ ధర కేవలం *32 లక్షలు* మాత్రమే నెలకు ఆదాయం *27,000/-**
💢బ్యాంకు లోను వసతి కూడా కలదు💢

👉బై బ్యాక్ సదుపాయం అందుబాటులో ఉంది
👉Buy Back Guarantee Offer 👍🏻💐
30 లక్షల నుండి 45 లక్షలు
ప్రతి కస్టమర్ తీసుకునే అవకాశం👆👆

🙏మరిన్ని వివరాల కోసం సంప్రదించగలరు🙏
☎️ *9848283239*

            plots  #3 star suit rooms     highway
02/01/2022

plots #3 star suit rooms highway

Address

Madhapur
Madhapur
500081

Alerts

Be the first to know and let us send you an email when ALP Infra Projects posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category