23/11/2024
ఈ మధ్య పాతిక,ముప్పై ఏండ్లు కాపురం చేసిన జంటలు కూడా విడాకులు తీసుకోవడం లో వెనుకడుగు వేయడం లేదు. కారణం సమాజం లో విరివిగా లభిస్తున్న స్వేచ్చా ఫలాలు లేట్ గానైన ఎందుకు అందుకోకూడదు అనే ఆలోచన పెరుగుతుండడం కావచ్చు.వీరి స్వయంకృత మలి జీవితం ఎలా ఉన్నా, విది వశాత్తు ఒంటరి అయినవారి జీవితం మాత్రం దుర్భరంగా నే ఉంటుంది. ప్రేమాభిమానాలు ఉన్న పిల్లలు ఉన్నా,వారికుండే
పనులు బిజీ వల్ల తల్లి తండ్రులు తో గడపడానికి తగిన సమయం కేటాయించే పరిస్థితులు లేకపోవచ్చు.అలాంటి సందర్భాల్లో మలి వయసు లోఒక తోడు కావాలి అనిపిస్తుంది.
అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే,ఇలా మలి వయసులో తోడు కోరుకునే వారికి వివాహం అనే ప్రక్రియ అవసరమా?పెండ్లి లేకుండా సహజీవనం చేయలేరా? వయసులో ఉండి, పిల్లల్ని కనగలిగిన వారెమో పెండ్లి అనేది లేకుండా, సహజీవనం చేయడానికి ఇష్టపడుతున్నారు.వయస్సు మళ్ళిన వారు,కుటుంబ బాధ్యతలు లేనివారు విడాకులు లేదా విదివశాత్తూ ఒంటరిగా మారితే మళ్ళీ పెండ్లి గురించి ఆలోచన చేయడమంటే ఇదొక సోషల్ డిజార్డర్ నెస్ అనొచ్చు.అంటే 20 లో చేయాల్సిన పనిని,అరవైలో,అరవై లో చేయాల్సిన పనిని ఇరవై లో చేయడం లాంటిది.
సాధారణంగా తల్లి లేక తండ్రి రెండవ పెండ్లి చేసుకోవడానికి మేజర్ అయిన పిల్లలు ఎక్కువమంది అంగీకరించరు.కారణం తమ తల్లి లేక తండ్రి స్తానం మరొకరికి ఇవ్వడానికి ఇష్టపడక పోవడం,ఆస్తుల పంపకం విషయం లో కలిగే భేదాభిప్రాయాలు కారణాలుగా ఉంటాయి.కాబట్టి వీటన్నింటికి చక్కటి పరిష్కారం సహజీవనం. కుటుంబ సభ్యులు కూడా అంగీకరించే స్నేహపూర్వక సామాజిక జీవిత ఒప్పందం..
కాబట్టి యవ్వనం లో తోడు కోరుకునే వారు వివాహం చేసుకుని కుటుంబ అభిరుద్దికి తోడ్పడడం, అన్ని అయిపోయి,మలి వయసులో తోడు కావలసిన వారు సహజీవనం ద్వారా కుటంభం విచ్చినం కాకుండా చూసుకోవడం మంచిది.ఈ విధానం ని మ్యారేజ్ బ్యూరో లు,ఇతర సంస్థలు కౌన్సిలింగ్ ద్వారా పిల్లల్ని,పెద్దల్ని ఒప్పిస్తే, సమాజం లో అన్ని వయసుల వారికి కుటుంబ భద్రత ఉంటుంది.