Suman Boorla

Suman Boorla Common Man

Congratulations team India 🎊🎊🎉🎉🎉🚩🚩🚩
09/03/2025

Congratulations team India 🎊🎊🎉🎉🎉🚩🚩🚩

అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు.ఓం నమఃశ్శివాయ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
26/02/2025

అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు.

ఓం నమఃశ్శివాయ
🚩🚩🚩🚩🚩🚩🚩🚩

కూతురిపై అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులని ఆశ్రయిస్తే, సరైన చర్యలు తీసుకోగపోగా డబ్బులకు అమ్ముడుపోయి వీళ్ళపైనే కేసులు పెడ...
12/12/2024

కూతురిపై అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులని ఆశ్రయిస్తే, సరైన చర్యలు తీసుకోగపోగా డబ్బులకు అమ్ముడుపోయి వీళ్ళపైనే కేసులు పెడతామని బెదిరించారట.

అది తట్టుకోలేని నాన్న, కువైట్ నుండి వచ్చి అసభ్యంగా ప్రవర్తించినోడిని చంపేసాడు.

సినిమాలో హీరో ఇలా చేస్తే, బాగా చేశాడని హీరో కి చప్పట్లు కొడతారు, నిజజీవితంలో జరిగింది కదా, సమాజం ఎవరివైపు నిలబడుతుందో చూడాలి. యూట్యూబ్ వీడియో కామెంట్స్ కింద మాత్రం కువైట్ ప్రసాద్ కే చాలా మంది మద్దతు తెలుపుతున్నారు.

పోలీసులు వాళ్ళ పని సక్రమంగా చేస్తే హత్య జరగకపోయేదేమో అని నా ఫీలింగ్

విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ, వ్యాపారం అంటె  కేవలం ఆదాయం మాత్రమే కాదని, అభిమానం, ఆత్మీయత అని నిరూపిస్తూ, భారతీయుల గుండ...
09/10/2024

విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ, వ్యాపారం అంటె కేవలం ఆదాయం మాత్రమే కాదని, అభిమానం, ఆత్మీయత అని నిరూపిస్తూ, భారతీయుల గుండెల్లో చెరగని ముద్రవేసిన గొప్ప వ్యాపారవేత్త.
నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.

దేశం సంకట స్థితిలో ఉన్నప్పుడు అన్నీ మరిచి ఆపన్న హస్తాన్ని అందించే అచంచల దేశభక్తుడు.

పేద, మధ్యతరగతి వాళ్ల కష్టాలను దూరం చెయ్యడమే వ్యాపరమని, ఆదాయం కంటే ఆత్మ సంతృప్తి గొప్పదని నమ్మే మంచి మనసుతో కొట్లాది భారతీయుల హృదయాలను దోచుకొని గొప్ప లాభాన్ని సంపాదించి ఆ భగవంతుడే ఆశ్చర్యపోయే ప్రేమాభిమానాల మూటలు వెంటబెట్టుకొని వెళ్లిన సిసలైన భారత రత్నం శ్రీ రతన్ టాటా గారికి కన్నీటి వీడ్కోలు.

రతన్ జి..!! మీ నుండి నిరాండబరత, విలువలతో కూడిన వ్యాపార సూత్రాలు స్ఫూర్తి పొంది ఆచరిస్తున్నాం...

రతన్ టాటా గారికి నివాళులు 💐🙏

ఓం శాంతి రతన్ టాటా గారు 💐💐💐

ఏదో గ్లోబల్ ఇష్యూ అంట, నిన్న అందరి లాప్టాప్ లు ఇట్ల బ్లూ స్క్రీన్ వచ్చి షట్ డౌన్ అయ్యాయ్. ముందు నా లాప్టాప్ ప్రాబ్లెమ్ అ...
20/07/2024

ఏదో గ్లోబల్ ఇష్యూ అంట, నిన్న అందరి లాప్టాప్ లు ఇట్ల బ్లూ స్క్రీన్ వచ్చి షట్ డౌన్ అయ్యాయ్. ముందు నా లాప్టాప్ ప్రాబ్లెమ్ అనుకున్న, అప్పుడు మీటింగ్ లో ఉండే, ఒకరి తరువాత ఒకరు ఇదే కంప్లైంట్, తరువాత గ్లోబల్ న్యూస్ వచ్చింది అందరికి ఇదే ప్రాబ్లెమ్ అని.

https://www.newscientist.com/article/2440319-windows-computers-around-the-world-are-failing-in-a-major-outage/

అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు🚩🚩🚩🎉🎁🎊🎊
17/07/2024

అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు🚩🚩🚩🎉🎁🎊🎊

ఎవరైనా తప్పు చేసినప్పుడు నాకెందుకులే అని చూస్తూ కూచుంటే, ఏదో ఒకరోజు నీకు అన్యాయం జరిగినప్పుడు కూడా నీతరుపున నిలబడేందుకు ...
15/07/2024

ఎవరైనా తప్పు చేసినప్పుడు నాకెందుకులే అని చూస్తూ కూచుంటే, ఏదో ఒకరోజు నీకు అన్యాయం జరిగినప్పుడు కూడా నీతరుపున నిలబడేందుకు ఎవ్వరు రారు. తప్పును ప్రశ్నించకపోవడం చాలా పెద్ద తప్పు. అన్యాయాన్ని ప్రశ్నించడం మొదలుపెడితేనే సమాజం మారేది.

కింది విడియోలో ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్ ని ఎలాంటి కారణం లేకుండా బయటికి పంపిస్తాడు, ఆ స్టూడెంట్ కారణం అడిగితే చెప్పాల్సిన అవసరం లేదు బయటికి వెళ్ళు అంటాడు. అక్కడ ఉన్న మిగతా స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు కానీ ఎందుకు బయటికి పంపిస్తున్నారు అని ఆ స్టూడెంట్ తరుపున నిలబడరు.

అప్పుడు ఆ లెక్చరర్ స్టూడెంట్స్ ను ఉద్దేశిస్తూ, అన్యాయంగా ఒక స్టూడెంట్ ని బయటికి పంపిస్తే మీరు చూస్తూ ఉన్నారు, కానీ ప్రశ్నించలేదు, కారణం అది మీకు జరగలేదు కాబట్టి. సమాజంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించకపోతే ఏదో ఒకరోజు మీకు అన్యాయం జరిగినప్పుడు ఎవరు రారు, ఎంత మంది అన్యాయం వైపు ఉన్నా మీరు మాత్రం న్యాయం వైపు ఉండాలి, ప్రశ్నించడం నేర్చుకోవాలి, అన్నింటికంటే ముఖ్యం అదే, లేదంటే మీకు అన్యాయం జరిగినప్పుడు కూడా ఎవరు రారని చక్కగా వివరిస్తాడు.

సమాజం అంటే ఒకరి పక్కన ఒకరు ఉండటం కాదు, ఒకరికోసం ఒకరు ఉండటం అంటాడు.

ప్రశ్నించే గొంతుకు పవర్ ఎక్కువ అంటాడు. ఇది నిజం. నాకెందుకులే అనుకోకుండా అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులో నేను ఒకడిని.

https://www.instagram.com/reel/C6_Z-K3OiAl/?igsh=N3R6eWViMjJ4MG1l

మా గంగాధర రిజిస్ట్రార్ పైన అధికారుల దృష్టి పడ్డది, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకున్నా రిజిస్ట్రేషన్ చేసే ఘనత ఆయనది. సెలవుల్...
12/07/2024

మా గంగాధర రిజిస్ట్రార్ పైన అధికారుల దృష్టి పడ్డది, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకున్నా రిజిస్ట్రేషన్ చేసే ఘనత ఆయనది. సెలవుల్లో ఉన్నాడట, ఎప్పటికైనా అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నోడు, చేసినోడు ఏదో ఒకరకంగా శిక్ష అనుభవించాల్సిందే. కాలం ఎప్పడు ఒకేలా ఉండది, అన్యాయానికి ఖచ్చితంగా కాలం చెల్లే రోజు తప్పకుండా వస్తది.

ప్రపంచంలో 15 దేశాలు అతనికి వాళ్ల దేశ అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేశాయి. 75 సంవత్సరాల భారత దేశ చరిత్రలో ప్రపంచంలో ఏ దే...
12/07/2024

ప్రపంచంలో 15 దేశాలు అతనికి వాళ్ల దేశ అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేశాయి.
75 సంవత్సరాల భారత దేశ చరిత్రలో ప్రపంచంలో ఏ దేశనేతకి కూడా ఇంత గౌరవం పొందిన నాయకుడు పుట్టలేదు ఒక్క మోడి తప్ప.
భవిష్యత్తులో ఇంకా ఎవరికి సాధ్యం కాదేమో.
ఇది 140 కోట్ల భారతీయులకు దక్కిన అరుదైన గౌరవం, ఇది దేశభక్తి గల భారతీయులు గర్వించదగ్గ విషయం.
జై భారత్
జై నరేంద్ర మోడీ 🇮🇳🙏💐

Copied from Hariprasad Patel

కాషాయ దళపతి, జనం మెచ్చిన నాయకుడు,పేదప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ప్రజల అభిమాన నాయకుడు, బీజేపీ రాష్ట్ర రథసారథి, కరీనగర్ మ...
11/07/2024

కాషాయ దళపతి, జనం మెచ్చిన నాయకుడు,పేదప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ప్రజల అభిమాన నాయకుడు, బీజేపీ రాష్ట్ర రథసారథి, కరీనగర్ ముద్దుబిడ్డ, బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మా బండి సంజయ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!
ఒక సాధారణ పార్టీ కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి, ప్రతిక్షణం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నందుకు మీ అభిమానిగా గర్విస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు చేపట్టి పేద ప్రజలకు వెన్నంటి ఉండాలని కోరుకుంటూ..
-మీ తమ్ముడు సుమన్ బూర్ల

https://www.facebook.com/share/B2FNTdp6HZC6kqvi/?mibextid=JOZb8W

-Suman Boorla

వార్తలంటే చిన్నతనంలో దూరదర్శన్ లో 7 గంటలకు వచ్చే శాంతి స్వరూప్ గారే గుర్తొస్తారు. నెమ్మదిగ అర్థమయ్యేలా చదివేవారు. అతని మ...
05/04/2024

వార్తలంటే చిన్నతనంలో దూరదర్శన్ లో 7 గంటలకు వచ్చే శాంతి స్వరూప్ గారే గుర్తొస్తారు. నెమ్మదిగ అర్థమయ్యేలా చదివేవారు. అతని మరణం బాధాకరం.
ఓం శాంతి 💐💐

Address

Karimnagar
505001

Alerts

Be the first to know and let us send you an email when Suman Boorla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share