01/08/2019
*భూమికి వాడుక భాషలో వాటి పేర్లు*
1) *గ్రామ కంఠం*:
గ్రామంలో నివసించడానికి కేటాయించిన భూమినే *గ్రామ కంఠం* అంటారు.ఇది గ్రామానికి సంబంధించిన ఉమ్మడి స్థలం.దీనిలో ప్రభుత్వ సభలు,సమావేశాలు నిర్వహించుకోవచ్చు.
2) *అసైన్డ్ భూమి*:
భూమిలేని నిరు పేదలు సాగుచెయ్యడానికి,ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని *అసైన్డ్ భూమి* అంటారు.ఈ భూమిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే కానీ అమ్ముకోవడానికి/బధాలయించడానికి వీలుండదు.
3) *ఏ.డబ్ల్యూ(A. W.)భూమి*:
శిస్తును నిర్ధారించిన ప్రభుత్వ భూములను లేదా అసైన్డ్ వెస్ట్ ల్యాండ్ భూమి అంటారు.శిస్తూ కట్టిన AW భూములు మెట్ట భూములైతే "ల్యాండ్స్"అంటారు.వీటిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసే అధికారం ఉంటుంది..
4) *బంజరు భూమి*:
గ్రామం,మండలం పరిధిలో ఖాళీగా నిరుపయోగంగా ఉన్న భూములను బంజరు భూమి అంటారు.వీటిని రెవెన్యూ రికార్డులో ప్రత్యేక గుర్తుతో సూచిస్తారు.
5) *అగ్రహారం*:
పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తూ లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా అందజేసిన గ్రామం లేదా అందులో కొంత భాగాన్ని అగ్రహారం అంటారు..ఈ భూమిని అమ్ముకోవడానికి వీలులేదు.
6) *అడంగల్*:
దీనినే పహాని అని కూడా అంటారు.గ్రామంలో సాగు భూముల్ని ఈ దస్త్రంలో (రిజిస్టర్) నమోదు చేస్తుంటారు.దీనినే గ్రామ లెక్కలలో 3నెం.రిజిస్టర్ అని కూడా పిలుస్తారు.ఆంధ్రలో అడంగల్ అంటే తెలంగాణలో పహాని అని పిలుస్తారు.
7) *చిట్టా*:
రోజువారీ వసూళ్లను తెలిపే రిజిస్టర్ ని *చిట్టా* అని అంటారు.దీనిని గ్రామ లెక్కల నెం.6 గా పిలుస్తారు.ప్రభుత్వానికి చెల్లించవల్సిన నీటిపన్ను,భూమి శిస్తూ వగైరాలను ఆసామిల వారిగా వసూలు చేసి రిజిస్టర్ లో నమోదు చేస్తారు.
8) *జమ బందీ*:
ప్రభుత్వానికి రావాల్సిన భూమి శిస్తూ,నీటి పన్ను ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడం,రెవెన్యూ లెక్కలోకి తీసుకొచ్చార లేదా అని నిర్ధారించడం,గ్రామ,మండల లెక్కల విస్తృత తనిఖీలను *జమ బందీ* అంటారు.
9) *అజమాయిషీ*
భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కలు ఉన్నది,లేనిది తనిఖీ చేయడాన్ని *అజమాయిషీ* అంటారు.RI,VRO రాసిన వివరాలను సంబంధిత MRO/Deputy. MRO తనిఖీలు నిర్వహించాలి.ఈ విందగా తనిఖీ చేసిన లెక్కల వివరాలను గ్రామ లెక్కల నెం.3 (పహాని) లో నమోదు చెయ్యాలి.
10) *ఆబాధి*:
సర్వే నెం.లోకాని, గ్రామ రికార్డ్ లో గాని,పహానిలో గాని భారత దేశానికి స్వాత్రంత్రం రాకముందు నుండి ఎటువంటి దస్త్రాలపై అంటే రికార్డులో లేకుండా గ్రామ వారసత్వ పెద్దల సాక్షిగా స్థిర నివాసం,స్థిర ఆస్తిని *ఆబాధి*అంటారు..ఈ భూమిని ఇప్పటి జెనరేషన్ ప్రకారం రికార్డులో కి ఎక్కించవచ్చును.
అమ్ముకోవచ్చును.
11) *దస్తవేజు*:
భూములకు సంబంధించి కొనుగోలు,అమ్మకాలు,కౌలుకు ఇవ్వడం,ఇతర లావాదేవీలను తెలియజేయి పత్రం.భూ బదలాయింపు చేసే సమయంలో ఈ దస్తవేజులను చట్ట పరంగా రిజిస్ట్రేషన్ చేయించాలి.
12) *ఎన్ కాంబరెన్స్ సర్టిఫికెట్(EC)*:
భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువపత్రం.32 ఏళ్ల లోపు ఓ సర్వే నెం.భూమికి గలా లావాదేవీలను తెలియజేస్తుంది..
13) *ఫీల్డు మెజర్ మెంట్ బుక్(FMB)*:
దీనిని FMB టిప్పన్ అని కూడా అంటారు.గ్రామ రెవెన్యూ రికార్డ్ లలో fmb ఒక భాగం.ముక్యంగా దీనిలో గ్రామంలోని అన్ని సర్వే నెం.,పట్టాలు,వాటి కొలతలు ఉంటాయి.
14) *బందోబస్తు*:
వ్యవసాయ భూములను సర్వే నిర్వహించి వర్గీకరణ చేపట్టడాని *బందోబస్తు* అంటారు.
15) *B మెమో*:
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగుచేస్తున్న వ్యక్తికి శిస్తూ చెల్లించాలని ఆదేశిస్తూ ఇచ్చే నోటీస్.అర్హులైతే కొనసాగిస్తారు,లేకపోతే తొలగిస్తారు...భూమిని ప్రభుత్వం తీసుకుంటుంది అనర్హులతే..
16) *ఫసలీ*:
ఏటా జులై 1వ తేదీ నుండి తర్వాత సం., జూన్ 30 వరకు ఉన్న 12 నెలల కాలాన్ని *ఫసలీ* అంటారు.ఈ పదం మొగల్ చక్రవర్తులు కాలం నుండ వాడుకలోకి వచ్చింది.
17) *ఎకరం*:
ఇది భూమి విస్తీర్ణానికి కొలమానం.4,840 చ,,గజాల స్థలం లేదా 100 సెంట్లు(సెంట్ అంటే 48.4గజాలు) లేదా 40 కుంటలు(కుంట అంటే 121 చ,గజం)వీటిని *ఎకరంగా* పిలుస్తారు.