03/06/2018
గౌరవ హుస్నాబాద్ ఎమ్మెల్యే వడితల సతీష్ కుమార్ గారు హుస్నాబాద్ పట్టణంలో పాలిటెక్నిక్ కాలేజీలో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ కేవలం లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదు ఇతర అంశాల్లోనూ వారి పాత్ర కీలకంగా మారింది మంచి విద్యావంతులు కానిస్టేబుల్ గా ఎంపికవుతుండడం పోలీస్ వ్యవస్థ లో సమూల మార్పులకు దారి తీస్తుంది.నిన్న 18వేల పై చిలుకు యస్ ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైనది. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే విజయం సాదించగలుగుతారు. ఇన్నివేల పోస్టులు త్వరలో పడడం ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.ఏది అసాద్యం కాదు పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాదించగలుగుతాం.వచ్చే 70 రోజుల పాటు ఇచ్చే శిక్షణను ఎలా సద్వినియోగం చేసుకోవాలి.మనసును, ఆత్మను కంట్రోల్ చేసుకుంటేనే అనుకున్న లక్ష్యాన్ని సాదించగలుగుతారు.రాష్ట్రంలోనే ఉత్తమమైన కోచింగ్, అత్యంత ముఖ్యమైన మెటీరియల్ అందిస్తాం. బాధ్యత అంతా మాదే., కేవలం చదవడం మాత్రమే మీ పని.ఒక్క తండ్రి తన పిల్లలకు ఉద్యోగం రావాలంటే ఏమేమి సౌకర్యాలు కల్పిస్తారో అలాంటి అన్ని సౌకర్యాలు సిద్ధిపేట జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో కల్పిస్తున్నాంచిత్త శుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని మీ జీవితమంతా మీ చేతుల్లోనే ఉన్నదని దిశా నిర్దేశం చేశారు. క్రమ శిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చంటూ ఒక అరగంట ఆలోచన చేయండి సాధించలేనిదేమీ లేదు.కళ్లు తెరిస్తే కళ్లు మూస్తే కానిస్టేబుల్ ఉద్యోగమే ధ్యేయంగా చదవాలని ఎమ్మెల్యే గారు. ఆకాంక్షించారు. శిక్షణ తరగతి గదులలో సెల్ ఫోన్లు నిషేధం, ఖచ్చితంగా సమయానికి రావాలని, ఓపెన్ కాంపీటేషన్ పోస్టులు ఉన్నాయని ఆ ఓపెన్ కాంపీటేషన్ ఉద్యోగాలన్నీ మన హుస్నాబాద్ వారే పొందాలని ఆకాంక్షించారు. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోండిఆ లక్ష్య సాధనలో క్రమ శిక్షణకు అలవాటు పడితే.ఇతరఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు అని ఎమ్మెల్యే గారు తెలిపినారుఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజి రెడ్డి గారు, హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ జీ, మరియు హుస్నాబాద్ పట్టణం ప్రజాప్రతినిధులు అక్కన్నపేట ఎస్సై పాపయ నాయక్, టీచింగ్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.