IAL Telangana

IAL Telangana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from IAL Telangana, Legal Service, Hyderabad.

ఐఏఎల్ ప్రెస్ నోట్సత్వరమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. ఐ ఏ ఎల్ ప్రధాన బొమ్మగాని ప్రభాకర్.ప్రజాస్వామ్య వ్యవస్...
19/02/2021

ఐఏఎల్ ప్రెస్ నోట్
సత్వరమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. ఐ ఏ ఎల్ ప్రధాన బొమ్మగాని ప్రభాకర్.

ప్రజాస్వామ్య వ్యవస్థలో, న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్న జి. వామనరావు, శ్రీమతి నాగమణిలను అతికిరాతకంగా నడిరోడ్డు మీద కత్తులతో చంపడాన్ని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు.

నేడు హైదరాబాద్, హిమాయత్ నగర్ లోని రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి. ఎల్ అధ్యక్షతన ఐ ఏ ఎల్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యతలో ఉన్న న్యాయవాదులకు, అడ్వకేట్స్ కు ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడం వల్లనే జుడిషియల్ లోని, న్యాయవాదులు, ఆ బాధ్యత గురవుతున్నారని ప్రభాకర్ వివరించారు.
ఈ క్రమంలోనే గత కొంత కాలంగా న్యాయవాదులుగా కొనసాగుతున్న వామనరావు, నాగమణి లను కిరాతకంగా చంపిన వారిని తక్షణమే అరెస్టు చేసి, విచారించి, దోషులను, ఈ హత్యలను ప్రోత్సహించిన వారిని కటినంగా శిక్షించాలని బొమ్మగాని ప్రభాకర్ డిమాండ్ చేశారు.
తక్షణమే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ ఐ ఏ ఎల్ ప్రధాన కార్యదర్శి డి. జయ శ్రీనివాస్ వామనరావు నాగమణి ల మృతికి మరియు ఇటీవల చనిపోయిన న్యాయవాదుల కు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సమావేశంలో కె.వి.ఎల్, దామోదర్, శ్రీనివాస మూర్తి, కారంగుల రామ్మూర్తి, విష్ణుమూర్తి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

17/02/2021

Address

Hyderabad
500029

Website

Alerts

Be the first to know and let us send you an email when IAL Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category