Surya Savarnika Manavu Ashramam

Surya Savarnika Manavu Ashramam This page is about a registered Hindu Religious society which is presiding over by Sri Sri Manavu.
(1)

Surya Savarnika Manavu Ashramam is a registered Hindu Religious society vide in No. 8713/1999.it's aims and objects are diffusion of useful knowledge in the fields of Legal,Medical,Scientific,Political and philosophical for the promotion of reformative prosperous views among Hindu Community and also establish orphanage homes,educational institutions, and It is located at Garlavoddu (village),Enkoor(Mandal),Khammam(District),Telangana(State),INDIA

22/05/2026
ఒక కేసు విచారణ సందర్బంగా కాలయాపన చేసే వారిని కాక్ రోచ్ అన్నందుకు వ్యంగ్యంగా పుట్టిన ఆన్లైన్ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ....
22/05/2026

ఒక కేసు విచారణ సందర్బంగా కాలయాపన చేసే వారిని కాక్ రోచ్ అన్నందుకు వ్యంగ్యంగా పుట్టిన ఆన్లైన్ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ.క్షణికావేశం లో ఎవరో ఎదో అంటే దానికి లక్షల మంది సై అన్నంత మాత్రాన ఈ మహాబద్దకం జబ్బును వదిలించగలరా?ఎదుటి వారి బద్దకం గురించి తర్వాత ముందు మనలో ఉన్న బద్దకం వదిలించుకుని,మందికి బోధలు తర్వాత చేద్దాం
ఆ సందర్బంగా.....

న్యాయస్థానాల నీడన సాగే...
అంతులేని కాలయాపనల పర్వమిది,
ప్రశ్నించే గొంతుకలను చూసి
వ్యంగ్యంగా నవ్వుకునే వ్యవస్థల సాక్షిగా!
అవకాశవాదపు రంగులు మార్చే...
రాజకీయ జెండాల నీడన,
సిద్ధాంతాలను తుంగలో తొక్కి
అధికార పంచన చేరే నాయకులెందరో!
లక్షల మంది ఫాలోవర్ల వెల్లువ...
ఇంటర్నెట్ తెరలపైనే బంధీ,
సమాజ హితం కోసం శ్రమించే
సత్సంకల్పం ఎక్కడా కనపడదు!
పుబ్బాలో పుట్టి మఘలో మాడిపోయే...
ఈ క్షణిక సంచలనాల ప్రచారాలు,
మీడియా రేటింగుల ఆకలి తీరుస్తాయి తప్ప
దేశ ప్రగతికి ఒరగబెట్టేది ఏముంది?
సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు...
నేడు నువ్వు విసిరే వ్యంగ్య బాణాలు,
రేపు ప్రజాక్షేత్రంలో తిరగబడి
తీర్పు రూపంలో రెడ్ హిట్ లా నిన్ను తాకక మానవు!

గత కొన్నేళ్లుగా ప్రతి సోమవారం జిల్లా కలక్టరేట్ ల లలో నిర్వహించే "ప్రజావాణి"కార్యక్రమం సంతృప్తికరంగా లేదని స్వయంగా రాష్ట్...
22/05/2026

గత కొన్నేళ్లుగా ప్రతి సోమవారం జిల్లా కలక్టరేట్ ల లలో నిర్వహించే "ప్రజావాణి"కార్యక్రమం సంతృప్తికరంగా లేదని స్వయంగా రాష్ట్ర రెవిన్యూ అమాత్యుల వారితో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ వారు భావించినట్లు ఉంది.అందుకే మంత్రి గారు పాలేరు నియోజక వర్గ పరిధిలో గత కొద్ది కాలం నుండి వారం వారం ప్రజావాణి కార్యక్రమాం నిర్వహిస్తుంటే,కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం ని తమ చేతుల్లోకితీసుకున్నట్లు ఉంది.ప్రజలు ఇస్తున్న ఫిర్యాదులు కు సరి అయిన జవాబు దారి విధానం లో పరిష్కారాలు లేకనే,అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా "చెవిటి వాడి ముందు శంఖం ఉదినట్లు" ఉందని ప్రజా నాయకులు భావించడం వలననే ఈ కార్యక్రమం ని వారే స్వయంగా నిర్వహిస్తున్నట్లు బాధితులు బావించవలసి వస్తుంది.అది నిజం కాదు అని రుజువు చేయాలి అంటే ప్రభుత్వం తక్షణమే ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం పై శ్వేత పత్రం విడుదల చేయాలి.
ప్రతి జిల్లాలో గత రెండేళ్లుగా ప్రజావాణి కార్యక్రమం లో వచ్చిన ఫిర్యాదులు ఎన్ని?వాటిలో ఎన్ని సంపూర్ణంగా పరిష్కారం అయ్యాయి?కేవలం టెక్నీకల్ కారణాలతో ఎన్ని రిజెక్ట్ అయ్యాయి?రిజెక్ట్ కాబడిన వాటికి పరిష్కార మార్గం అర్జీదారులకు చెప్పారా?,.ఇత్యాది వివరాలతో ప్రతి జిల్లా కలక్టరేట్ నుండి అధికారిక సమాచార పత్రం విడుదల చేయాలి.అప్పుడే ప్రజావాణి ద్వారా ప్రజలకు ఎంతవరకు మేలు జరిగిందో అర్ధం అవుతుంది.చేస్తారని ఆశిద్దాం.

" మంది మాటలు విని మారు మనువుకు పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు ఆగం అయిందట" అలా ఉంది ఈ కేసు..మన సమాజం లో నేడు పెరిగిపోతున్న వ...
21/05/2026

" మంది మాటలు విని మారు మనువుకు పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు ఆగం అయిందట" అలా ఉంది ఈ కేసు..మన సమాజం లో నేడు పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు వలన కుప్పకూలిపోతున్న కుటుంబ వ్యవస్థకు ఉదాహరణ ఈ కేసు గా చెప్పొచ్చు.
ఆవిడకు పెండ్లి అయింది.కూతురు ఉంది.ఎవరో నజీర్ అనే మెకానిక్ తో పాత పరిచయం ఉంది అట. ఈ నాడు వస్తున్న కిన్ని లత్కోర్ సినిమాల కథల్లో మాదిరి పెండ్లి అయిన సరే నిన్ను పెండ్లి చేసుకుంటాను అని నమ్మించినట్లు ఉన్నాడు. ఎదో ఒక గొడవ పెట్టుకుని ,మొగుణ్ణి వదిలేసి కూతురిని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది.భార్య భర్తల మధ్య వివాదం గత రెండేళ్లుగా పోలీస్ స్టేషన్ లొనే నడుస్తుంటే,వారికి విడాకులు కాకుండానే,ఇప్పుడు ఆ తల్లి ఇంకొక కేసు ప్రియుడి పై పెట్టింది ఆట.నన్ను పెండ్లి చేసుకుంటాను అని నమ్మించి,అవసరాలు తీరాక ఇప్పుడు చేసుకొను పో అని చీటింగ్ చేసాడు అని.పోలీసులు కేసు పెట్టారు ఓ.కె
ఇప్పుడు ఆ చిన్న కూతురు ఉన్న తల్లి పరిస్థితి ఏమిటీ? ఈ వ్యవహారం అంతా కోర్టు లో చెప్పుకుంటే ఆమె భర్తకి కోర్టులో విడాకులు వస్తాయి.ప్రియుడా పెండ్లి చేసుకోడు. ఆమె పని "రెంటికి చెడ్డ రేవడి" పని అయింది.
అటు ఉన్నత న్యాయస్థానాలు వారేమో వివాహేతర సంబంధం ఉండటం నేరం కాదు అంటున్నారు.ఇక కుటుంబ వ్యవస్థకు రక్షణ ఎక్కడ?వివాహేతర సంబంధాలు కట్టడి కోసం పొక్సో లాంటి కఠిన చట్టాలు చేస్తే తప్ప భారతదేశం లో కుటుంబాలు కుప్పకూలి పోయి,పిల్లలు సరి అయిన రక్షణ లేని అభద్రతా బావమ్ తో బ్రతకాల్సిన పరిస్థితి.సమాజం లో నెరప్రవృత్తి విపరీతంగా పెరిగి అనేక విపరీత పరిణామాలు ఎదుర్కోవలసిన పరిస్తుతులు వస్తాయి.అందుకే వివాహేతర సంబంధాలు నియంత్రణ కు కఠిన చట్టం అవసరం అనేది.

చిత్తం శివుడి మీద,భక్తి చెప్పుల మీద అని సామెత.కొత్త చెప్పులు గుడికి వేసుకు వెళ్లిన వాడికి,గుళ్లో శివ దర్శనం చేసుకుంటున్న...
20/05/2026

చిత్తం శివుడి మీద,భక్తి చెప్పుల మీద అని సామెత.కొత్త చెప్పులు గుడికి వేసుకు వెళ్లిన వాడికి,గుళ్లో శివ దర్శనం చేసుకుంటున్నా,దానిమీద మనస్సు లగ్నం కాక,బయట విడిచిన కొత్త చెప్పులు ఏ దొంగ ఎత్తుకు వెళతాడో అని వాటి గురించి ఆలోచిస్తుంటాడు అట.
మరి అలాంటి వారు ఈ వెండి చెప్పులు వేసుకు వెళితే,చిత్తం,భక్తి రెండూ చెప్పుల మీదే ఉంటాయి కాబోలు.ఇంటికే8 వచ్చిన అల్లుడికి కాళ్లకు నీళ్లు ఇచ్చి,యోగక్షేమాలు కనుకుని,కమ్మటి పిండివంటలు తో భోజనం పెడితే అత్తగారి ఇల్లును అల్లుడు ఎప్పుడూ మర్చిపోడు.వెండి చెప్పులు ఇచ్చి అల్లుడు కు తమ గొప్పతనం చాటడం తప్ప,అవి డైలీ వేర్ కి పనికొచ్చేయా చచ్చేయా!వెండి చెప్పులు తో పాటు వాటి కాపలాకు ఒక జాతి కుక్కను కూడా ఇచ్చి,దాని మెయింటెనెన్సు కు నెలవారీ డబ్బులు కూడా ఇస్తే మీ పేరు చెప్పుకుంటారు అల్లుడు గారు.

19/05/2026

I got over 2,000 reactions on my posts last week! Thanks everyone for your support! 🎉

ఓరి భగవంతుడా!వినాశకాలే విపరీత బుద్ధి అని వీళ్ళకి ఎలాంటి పోకదల బుద్ధులు!అప్పు తీర్చడం కంటే హత్య చేయడమే సులువు అనే ఘోరమైన ...
19/05/2026

ఓరి భగవంతుడా!వినాశకాలే విపరీత బుద్ధి అని వీళ్ళకి ఎలాంటి పోకదల బుద్ధులు!అప్పు తీర్చడం కంటే హత్య చేయడమే సులువు అనే ఘోరమైన తలంపును ఆచరణ లో పెట్టారు అంటే ఈ జంటకు అసలు ప్రభుత్వం,పోలీసులు అంటే భయం ఏ మాత్రం అయినా ఉందా?
కరిమాభి మొత్తం 8 మంది దగ్గర అప్పు తీసుకుని అందులో 2 అప్పు ఇచ్చిన మహిళలను ,అప్పు తీరుస్తాను రా అని పామ్ హౌస్ కు పిలిపించి, తన భర్త రెహమాన్ తో కలసి వారిని చంపింది.ఇంకోకరు ను కూడా పిలిచింది కానీ వారు రాలేక పోవడం తో ప్రాణాలు దక్కించుకున్నారు.ఇలా మిగతా 6 గురిని ఆ కరిమాభి-రెహమాన్ జంట చంపడానికి ప్లాన్ చేసారని చేశారు అని తెలిసి,ఇప్పుడు వారికి అప్పు ఇచ్చిన వారు ప్రాణభయం తో పోలీస్ రక్షణ కోరారు అంట.!

అదీ సంగతి!చివరకు బాయ్ ఫ్రెండ్,గర్ల్ ఫ్రెండ్ సంస్కృతి బండి భగీరథ ని ఎలా జైలుకు పంపిందో చూసారా! బాయ్ ఫ్రెండ్ గా ఉండటం పెద్...
17/05/2026

అదీ సంగతి!చివరకు బాయ్ ఫ్రెండ్,గర్ల్ ఫ్రెండ్ సంస్కృతి బండి భగీరథ ని ఎలా జైలుకు పంపిందో చూసారా! బాయ్ ఫ్రెండ్ గా ఉండటం పెద్ద గ్రేట్ అనుకునే ఈ కాలం యువత కి ఈ కేసు కనువిప్పు కావాలి. భారత దేశం లో ఒక మైనర్ అమ్మాయిని టచ్ చేస్తే,మంత్రి గారి అబ్బాయి అయినా,ముఖ్యమంత్రి గారి కొడుకు అయినా ఊచలు లెక్కపెట్టాల్సిందే.ఒక వేళ వయసు తేడా విషయం లో నీవు నిర్దోషి అని నిరూపించుకుంటానికి అయినా 10 నుంచి 20 ఏండ్లు పట్టొచ్చు.మైనర్ విషయం లో అమ్మాయి ఒప్పుకున్నా, అటు ఇటు అమ్మ బాబులు ఒప్పుకున్నా,చట్టం ఒప్పుకోదు.ఈ విషయం లో చట్టమే సుప్రీం.కాబట్టి మైనర్ లను గర్ల్ ఫ్రెండ్ గా పెట్టుకుని ఉరేగితే అదే మీకు ఉరి తాడు మాదిరి ఉక్కిరి బిక్కిరి చేసి చంపుతుంది.
అదే మేజర్ విషయం లో అయితే మీ ఇష్టం.కట్టుకున్నోలని వదిలేసి ,ఇష్టం వచ్చినోళ్లతో ఎదురింట్లో సహజీవనం చేసినా ఎవరు ఏమనటానికి వీలు లేదు.కావాలంటే పోలీస్ రక్షణ కూడా దొరుకుతుంది.కారణం మేజర్ కాంసెంట్.మేజర్ ఇచ్చే కాంసెంట్ కు కూడా ఒక పరిమితి ఉంది.స్త్రీ నో అంటే నో. పాతికేళ్ళగా సహజీవనం చేస్తున్నా,ఒక్క సారి నో అంటే దూరంగా ఉండాల్సిందే.లేకుంటే రేప్ కేస్ లి బుక్ అవుతారు.ఇది పెండ్లి చేసుకున్న వారి విషయం లో వర్తించదు. మారిటల్ రేప్ ని కూడా నేరంగా పరిగణించాలి అని అభ్యదయవదులు కోరుతున్నారు కానీ ఇంకా పెద్దలు ఒప్పుకోలేదు.
ఇక పోతే ఇండియాలో ఏదైనా నేరం జరిగితే పోలీసులు కంటే ముందుగానే ఇన్వెష్టిగేషన్ చేయడం,కోర్టుల కంటే ముందు జడ్జ్ మెంట్ లు ఇచ్చేయడం మీడియా/సోషల్ మీడియా లకు అలవాటుగా మారింది.కాబట్టి కోర్టులు వీరు ఇచ్చే జడ్జిమెంట్ లను అప్రూవ్ చేయడమో,పక్కకు నెట్టేయడమో చేసినట్లు ఉంటాయి.అది కూడా చాలా ఏండ్ల తర్వాత .వీటిని నియంత్రించమని ఏ రాజకీయ పార్టీ కొరదు ఎందుకంటే మీడియా లే కాదు సోషల్ మీడియా కూడా ఎవరి వింగ్ లు వారి కున్నాయి.కాబట్టి యవ్వన దశలో ఉన్న పిల్లలు, ముఖ్యంగా మగపిల్లలు మీకు కుటుంబ గౌరవం గురించి ఏ మాత్రం అలోచన ఉన్నా, బాయి ఫ్రెండ్,గర్ల్ ఫ్రెండ్ సంస్కృతికి దూరం గా ఉండండి.పబ్ లు,షి-కార్లు ఇవ్వన్నీ మన సంస్కృతి కి గొడ్డలి పెట్టు.పెద్దలు కూడా ఈ విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి.మీ పిల్లలు ప్రవర్తన లను నిత్యం గమనిస్తుండాలి.పిల్లలు కు పరిమిత స్వేచ్ఛ మాత్రమే ఇవ్వాలి అని బండి భగీరథ కేసు ద్వారా అయినా గ్రహిస్తే మంచిది.

మేము అంతే నాయనా!సెక్యులరిజం కి  వ్యతిరేకం కాదు,మీ లాంటి కుహనా సెక్యులరిస్టు లకు మాత్రమే  వ్యతిరేకం.ఎందుకంటే సెక్యులరిజం ...
16/05/2026

మేము అంతే నాయనా!సెక్యులరిజం కి వ్యతిరేకం కాదు,మీ లాంటి కుహనా సెక్యులరిస్టు లకు మాత్రమే వ్యతిరేకం.ఎందుకంటే సెక్యులరిజం అంటే అన్ని మతాలను, ధర్మాలను,సమానంగా చూడాలి కదా!మరి మీరేంటి!ఈ దేశం లో మెజారిటీ ప్రజలు ఆచరించే హిందూ ధర్మాన్ని నిర్మూలించాలి అంటున్నారు?
అసలు హిందుత్వం లొనే సెక్యులరిజం అంతర్భాగంగా ఉంది.అందుకే శైవం,వైష్ణవం, గణపత్యం,శాక్తేయమ్,బౌద్ధం,జైనం తో పాటు హైందవేతర మతాలు, ధర్మాలు,ఇన్నేళ్ళుగా భారత్ లో ఉన్నాయి. అంతే కాని రాజ్యాంగం లో సెక్యులరిస్టు పదం చేర్చినందుకు కాదు.అసలు చేర్చక పోయినా ఇది నిజమైన సెక్యులరిస్టు కంట్రీ యే.
మేము ,చెట్టులో పుట్టలో,గట్టులో, రాయి లో,సర్వ జీవరాసిలో చివరకు వరాహం లో కూడా భగవంతుని చూడగల్గిన మేము సెక్యులరిస్టు లమా? లేక మీకు నచ్చని ధర్మాన్ని నిర్మూలించాలి అనే మీరా? ఇన్నాళ్లు ఏవో ద్రవిడ సిద్దాంతం పేరు మీద పబ్బం గడుపుకొచ్చారు.అవన్నీ ఉచిత హామీల దెబ్బకి గాలికి కొట్టుకు పోయాయి.ఇంకా మిగిలిన వారు కూడా మీ నుంచి దూరం అవుతారు అని మాట్లాడితే హిందూయిజం మీద మీ అక్కసు అంతా వెళ్గ గక్కుతున్నారు.కక్కండి.కక్కండి.చివరకు ఆ కక్కుడు రోగం తోనే తమిళులకు దూరం అయ్యే పరిస్తుతులు వస్తాయి.

అధ్యక్షుడైనా.. అల్లాడాల్సిందే!       ఫ్రాన్స్ దేశపు రాజువైనా.. పక్కా లోకల్ భర్తవైనా,ఇల్లాలి రూటే వేరు.. ఆమెతో పెట్టుకుంట...
15/05/2026

అధ్యక్షుడైనా.. అల్లాడాల్సిందే!

ఫ్రాన్స్ దేశపు రాజువైనా.. పక్కా లోకల్ భర్తవైనా,
ఇల్లాలి రూటే వేరు.. ఆమెతో పెట్టుకుంటే సీన్ సితారే!

బయట నువ్వు ఊపుతావు అధికారపు బెత్తం,
ఇంట్లో పడితే పడుతుంది చెంప దెబ్బ మొత్తం!
ప్రపంచ దేశాల మధ్య నువ్వు చేయొచ్చు సంధి,
కానీ ఆమె అలిగితే దొరకదు అసలు తిండి!

తన స్థానంపై కన్నేస్తే ఏ కన్నె అయినా,
అధ్యక్షుడి గల్లా పట్టి ఊపేస్తుంది ఏ ఇల్లాలైనా!
జీరో సైజ్ ఆఫీసులు.. హీరో లాంటి బిల్డప్పులు,
సతీమణి దెబ్బతో తేలిపోతాయి అన్నీ గాలిబుడగల్లా!

అందుకే ఓ మొగుడా.. హోదాలు పక్కన పెట్టు,
భార్య చెప్పినట్టు విని.. బుద్ధిగా బతికెయ్ ఒట్టు!(ఫ్రాన్స్ అధ్యక్షుడు ఒక నటి కి "చక్కగా ఉన్నావు"అని మెసేజ్ పెట్టినందుకు,అధ్యక్షుల వారి భార్య ఆయన చెంప చెళ్లు మనిపించిదని పత్రికా కథనాల సందర్బంగా,).

Pocso కేసులో Penetrative, Non penetrative అని సెక్షన్ల ఉంటాయి.బండి భగీరథ మీద Non penetrative సెక్షన్ల క్రింద కేసు నమోదు ...
14/05/2026

Pocso కేసులో Penetrative, Non penetrative అని సెక్షన్ల ఉంటాయి.బండి భగీరథ మీద Non penetrative సెక్షన్ల క్రింద కేసు నమోదు అయినట్లుంది.కాబట్టి బాధితురాలి తరపున ఇచ్చిన ఫిర్యాదులో ఆమెపై అత్యాచారం జరిగిందని చెప్పలేదు అనుకుంటా.కాబట్టి "కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకు "అన్నట్లు అబ్బాయి అమ్మాయి "వివాహ వాగ్దానా భంగం" కేసులో ఈ రాజకీయాల గోల ఎందుకు?
అమ్మాయి అబ్బాయి ఇష్టపడి సినిమాలకు షికార్లు కు తిరిగారు.అమ్మాయి ఫ్యామిలీ తో కలసి అబ్బాయి దేవాలయాలకు కూడా వెళ్లాడు. పెండ్లి చేద్దామంటూ ప్రపోజల్ తోనే అమ్మాయి తల్లితండ్రులు కూడా వారి షికార్లు కు ఓ.కె చెప్పి ఉండవచ్చు.తీరా పెండ్లి దగ్గరకు వచ్చేసరికి అబ్బాయి ఇంట్లో ఒప్పుకోకపోవడంతోనో,మరే కారణం తోనో నో చెప్పేసరికి అమ్మాయి ఫామిలీ 5 కోట్లు వాగ్దాన భంగం కి నష్టపరిహారంగా అడిగి ఉంటారు.
కేంద్ర మంత్రి స్తాయిలోఉన్న అబ్బాయి తండ్రికి 5 కోట్లు తలచుకుంటే పెద్ద లెక్క కాదు కాని,మరి ఎందుకో గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకునట్లు కనపడుతుంది,ముందుగా అబ్బాయే హనీ ట్రాప్ కేసు పెట్టడం ద్వారా.ఆ తర్వాత అమ్మాయి తరపు వారు pocso క్రింద కేసు పెట్టడం,అబ్బాయి తండ్రి కేంద్ర మంత్రి గారు కాబట్టి,ఆయన అంటే గిట్టని వాళ్ళు అంతా ఎగబడి పోవటం జరుగుతుంది.
అమ్మాయి మేజర్ అని అబ్బాయి తరవు వాళ్ళు,కాదు మైనర్ అని అమ్మాయి తరపు వాళ్ళు వాదించుకుంటున్నారు.pocso క్రింద కేసు బుక్ చేశారు అంటే ఎదో ఒక ఆధారం ఉంటేనే చేస్తారు.ఆ ఆధారం తప్పుడు దా కాదా అనేది కోర్టులో తేలుతుంది.ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే అమ్మాయి మైనర్ అని తెలిసి ఆమె తల్లి తండ్రులు , అబ్బాయి తో తిరుగుతుంటే ఎలా అనుమతించారు?బహుశా abetment క్రింద pocso చట్టం లో వారికి ఏ శిక్ష లేదని కాబోలు.
తమ తిరుగుళ్లకు తల్లితండ్రుల అనుమతి ఉందని తెలిసాక అబ్బాయి అమ్మాయి రెచ్చిపోయి డూయెట్లు పాడుకోకుండా గుళ్లో భజనలు చేసుకుంటుంటారా?
ఏతా వాతా అర్థం అయేదేమిటంటే,ఇష్టం ఉన్ననాళ్ళు తిరిగి కష్టం అనుకున్నప్పుడు కాదు అనుకునే "వాగ్దాన భంగం "కేసు ఇది. మాన భంగమో మర్యాద భంగమో కేసు కాదు.కాబట్టి కుటుంబ గౌరవాలూ,పరువు మర్యాదలు దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు కలసి ఒక సముచిత నిర్ణయం తో గొడవకు ముగింపు పలకడం మంచిది.లేకుంటే ఊళ్ళో పెండ్లికి కుక్కల హడావుడి అన్నట్లు,వాటి గోల కు ఇరు కుటుంబాలు నష్టపోతాయి. తస్మాత్!జాగ్రత్త.

Address

Surya Savarnika Manavu Ashramam
Enkoor
507168

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919399325372

Alerts

Be the first to know and let us send you an email when Surya Savarnika Manavu Ashramam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Surya Savarnika Manavu Ashramam:

Share

Category