Chandra Sekhar Indian

Chandra Sekhar Indian Change to socity 9491849088

28/08/2018
16/06/2017

To,
The CM
Andhra Pradesh ,

CC: All Ministers,
Sub: Save Agriculture

Respected Mr. Chandra babu Naidu Garu,

రైతులకు ఎరువులు ఉచితం
వ్యవసాయానికి కరెంటు ఉచితం
రుణ మాఫీ
విత్తనాలు సబ్సిడీ
ఈ ప్రభుత్వంలో రైతులకు అన్నీ ఫ్రీ
వీరికి ఇంకేం కావాలి , అని ప్రజల ఆలోచన
70% వ్యవసాయం పై ఆధార పడ్డవారే , కాని వీరికి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి,

అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని ప్రభుత్వ ఆలోచన

కానీ నేను ఒక రైతు బిడ్డగా చెబుతున్నా ,
మా రైతులకు ఏది ఫ్రీ ఫ్రీ ఫ్రీ గా ఇవ్వాల్సిన అవసరం లేదు అని విన్నవిస్తున్నా,

ఎందుకంటే ,

అంగన్ వాడి కార్యకర్తలను టీచర్లుగా ఎలా గుర్తించి 4,000 జీతం నుండి 10,000 జీతంగా పెంచావో,
1,500 జీతం ఉన్న సర్పంచ్ జీతం 5,000 చేసావో ,
75,000 జీతం ఉన్న MLA జీతం 1,50,000 చేసావో ,
విపరీతంగా పెంచిన గవర్నమెంటు ఉద్యోగుల జీతాలను ఏ విధంగా పెంచావో ,
అదే విధంగా , అదే శాతంతో సమానంగా రైతు పండించిన పంటకు ధరను నిర్ణయించి , ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలి.
ఎందుకు కొనుగోలు చెయ్యరు ప్రశ్నిద్దాం, పోరాడుదాం

లక్ష రూపాయల జీతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రోగం వస్తే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఫ్రీ , అతని పిల్లలకి ఫ్రీ , అతని భార్యకు ఫ్రీ మరియు అతని తల్లిదండ్రులకు కూడా ఫ్రీp
వారికి ఆఫీస్ టైం 9AM to 4:30PM , కచ్చితంగా టైం to టైం వెళతాడు , వస్తాడు.
మరి రైతు లేనిదే రాజ్యం లేదు , రైతే రాజు , రైతు లేకుండా జీవించలేము ,జై జవాన్ జై కిసాన్ , రైతు ఏడ్చిన రాజ్యం లేదు , ఎద్దు ఏడ్చిన ఎవుసం లేదు అని చెపుతున్న రాజకీయ నాయకుల్లారా ,

రాత్రనక , పగలనక , ఏ టైం లేకుండా , ఎప్పుడు పడితే అప్పుడు పొలానికి వెళ్లిన రైతు , తిరిగి వస్తాడో , లేదో తెలియక , ఇంటి దగ్గర ఎదురు చూసే భార్య , పిల్లలు , పంటకు రోగం , మనిషికి రోగం వస్తే ఎక్కడ చూపియ్య లో తెలియక , అప్పు చేసి , దిగుబడి తగ్గి కుంగిపోయే రైతులకు ఇస్తే ఫ్రీ అంటారు, ఉద్యోగులకు ఇస్తే ఇంక్రిమెంట్ అంటారు....

Please please feel it & Share it.. 🙏🙏 ఇట్లు
మీ ఒక రైతు బిడ్డ

16/06/2017

*🙏🏻తెలుగువాళ్ళమైన మనకు 'కారం' అంటే ఎంతో ఇష్టం.👌🏻*
*👌🏻అందుకే మన జీవన భాషలో కూడా ఎంతగా కారం కలుపుకున్నామో చూడండి.☘*
1.మొదలు పెట్టెే కారం -- శ్రీకారం
2. గౌరవించే కారం ----సంస్కారం,
3. ప్రేమ లో కారం --- మమకారం
4. పలకరించేకారం ----నమస్కారం
5. పదవి తో వచ్చే కారం ---అధికారం
6. అది లేకుండా చేసే కారం------ అనధికారం,
7. వేళాకోళం లో కారం ---- వెటకారం
8. భయం తో చేసే కారం ---- హాహాకారం,
9. బహుమతి లో కారం --- పురస్కారం,
10. ఎదిరించే కారం --- ధిక్కారం
11. వద్దని తిప్పికొట్టే కారం-----తిరస్కారం,
12. లెక్కల్లో కారం --- గుణకారం,
13. గుణింతం లో కారం -- నుడికారం
14. గర్వం తో వచ్చే కారం ---- అహంకారం,
15. సమస్యలకు కారం ----- పరిష్కారం,
16. ప్రయోగశాల లో కారం------- ఆవిష్కారం,
17. సంధులలో కారం --- 'ఆ'కారం,
18. సాయం లో కారం --- సహకారం
19. స్రీలకు నచ్చే కారం--- అలంకారం,
20. మేలు చేసే కారం ----ఉపకారం,
21. కీడు చేసే కారం -- అపకారం
22. శివునికి నచ్చే కారం ---- ఓం కారం,
23. విష్ణువు లో కారం ----శాంతాకారం,
24. ఏనుగులు చేసేది --- ఘీంకారం
25. మదం తో చేసే కారం --- హూంకారం,
26. పైత్యం తో వచ్చే కారం --వికారం,
27. రూపం తో వచ్చే కారం --ఆకారం
28. ఇంటి చుట్టూ కట్టే కారం -- ప్రాకారం,
29. ఒప్పుకునే కారం --- అంగీకారం,
30. చీదరించుకునే కారం ---చీత్కారం
31. పగ తీర్చుకునే కారం---- ప్రతీకారం,
32. మనం నేర్చుకునే కారం--- సంస్కారం
ఈ message చదివినవారికి 🙏

10/01/2017
03/10/2016

వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది.
దేవుడితో మొరపెట్టుకున్నాడు.

"రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు.
నా బతుకు చూడు.
ఎంత కష్టమో.
ఒక్క రోజు... ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా,"
అని సవాలు విసిరాడు.

దేవుడు వినీ వినీ సరేనన్నాడు. "అయితే ఒక్క షరతు. నువ్వు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. నోరు మెదపకూడదు."
అన్నాడు దేవుడు.

"సరే" అన్నాడు మనోడు.

తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు.

కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు.
"దేవా ... నా కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు" అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు. ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్లిపోయాడు.

మనోడు "ఒరేయ్... పర్సు వదిలేశావు చూసుకోరా..." అందామనుకున్నాడు.
కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు.

ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు.

"దేవా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అదినీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ" అంటూ మోకరిల్లాడు.
కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది."ఇలా దయ చూపించావా తండ్రీ" అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.

"ఒరేయ్ దొంగా.... "
అని అరుద్దామనుకున్నాడు మనోడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు.

ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు.
"దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ" అన్నాడు.

అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. "నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి" అన్నాడు.
పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు. "ఆగండ్రా... ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు పర్సును తీసుకెళ్లాడు." అని అరిచేశాడు.

దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు.

సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు.
దేవుడు వీధులు ఉడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు.

"దేవా... ఇవాళ్ల ఎంత మంచి పని చేశానో తెలుసా...
నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను. ఒక దోషిని అరెస్టు చేయించాను."
అన్నాడు మనోడు.

దేవుడు "ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నానా... ఎందుకలా చేశావు." అన్నాడు నిష్ఠూరంగా.

"అదేమిటి? నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను." అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా....

"ధనవంతుడు మహాపాపాత్ముడు. వాడు అందరినీ దోచుకుంటాడు.
వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను.
పేదోడికి కష్టాలు తీరేవి. వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు.

ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. వీడు అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు.

ఇప్పుడు చూడు... పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు... అన్నాడు దేవుడు.

దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు.
కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు.
తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండచ్చు.
ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం ?

16/09/2016

*🌬ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సమాచారం🕸*

☀16 సెప్టెంబర్ 2014ను అంతర్జాతీయ ఓజోన్ సంరక్షణా దినంగా జరిపుకున్నారు.

🌤ఓజోన్ పొర. క్షీణతకు కారణమవుతున్న పదార్థాలపై 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్స్ పై చేసిన సంతకాల తేదిని స్మరించుకునేలా ఈ రోజును నిర్ణయించబడింది.

⛅ఒజోన్ లేయర్ ప్రొటెక్షన్ 2014 థీమ్ : ది మిషన్ గోస్ ఆన్
ఈ రోజు సందర్భంగా, ప్రోటోకాల్ లక్ష్యాలను మరియు దాని సవరణలకు అనుగుణంగా కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ఒక రోజును అంకితమివ్వాలని అన్నిదేశాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది.

🌥అంతర్జాతీయ ఓజోన్సంరక్షణా దినం గురించి
ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్న పదార్థాలపై 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్స్ పై చేసిన సంతకాల తేదిని స్మరించుకునేలా 16 సెప్టెంబర్ రోజును UN జనరల్ అసెంబ్లీ 1994లో అంతర్జాతీయ ఓజోన్ పొర సంరక్షణా దినం ప్రకటించింది.
దశలవారీగా మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం తీసుకున్న చర్యల వల్ల, ఓజోన్ క్షీణతా పదార్థాల వాడకం తగ్గడం తద్వారా ఓజోన్ పొరను కాపాడటంలోనూ మరియు వాతావరణ మార్పు పరిష్కరించడ oలోనూ సహాయపడింది.

🌦 ఓజోన్ క్షీణతకు దోహదపడుతున్న పదార్థాలుగా పరిగణించబడే వాయువులలో ముఖ్యంగా కార్బన్ టెట్రా క్లోరైడ్, క్లోరో-ఫ్లోరో కార్బన్స్,హాలోన్లు ఉన్నాయి.

*💨ఓజోన్ పొర గురించి💨*

🌪ఓజోన్ పొర, సూర్యుని హానికరమైన కిరణాల నుండి భూమిని రక్షించడానికి వాయుకవచంలా ఉండి రక్షిస్తుంది. ఈ పొర భుగ్రహం మీద జీవరాసిని రక్షించడంలో సహాయపడుతుంది. హానికరమైన అతినీలలోహిత వికిరణం(harmful ultraviolet radiation) ను భూమికి చేరకుండా పరిమితం చేయడం ద్వారా మానవ ఆరోగ్యం మరియు పర్యావరణ వ్యవస్థలు రక్షిస్తుంది.
ఓజోన్ పొరను, ఫ్రెంచ్ భౌతికశాస్త్రవేత్తలు చార్లెస్ ఫాబ్రి మరియు హెన్రి బుసన్ 1913లో గుర్తించగా, భూమి ఉపరితలం నుండే స్ట్రాటోఆవరణ ఓజోన్ కొలవటానికి ఉపయోగిoచే స్పెక్ట్రోఫోటో మీటర్ ను కనుగొని బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు డి.ఎం.బి. డాబ్సన్ దాని ద్వారా ఓజోన్ యొక్క పూర్తి వివరాలు అన్వేషించాడు.

☄☄ 1928 మరియు 1958 మధ్య డాబ్సన్ ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ పర్యవేక్షణ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అవి ఈ రోజుకి కూడా పనిచేస్తున్నాయి.

🔥⚡ఓజోన్ భారాన్ని కొలిచే కొలతకు డాబ్సన్ యూనిట్ అని పేరును పట్టడం ద్వారా అతనిని గౌరవించారు.

☃ఆమ్లజని (ఆక్సీజన్‌) మరో రూపమే ఓజోన్‌. ఇదివిషవాయువు. ప్రతీ ఓజోన్‌ అణువులోనుమూడు ఆమ్లజని పరమాణువులున్నాయి. దీని రసాయన సాంకేతికం O3 అతినీల లోహిత వికిరణాల కారణంగా వాతావరణం పై పొరలో ఆక్సీజన్‌ అణువులు (O2) విడిపోతాయి.స్వేచ్చగా ఉన్న ఆక్సీజన్‌ పరమాణువు (O), తాడితంతో ఆక్సీజన్‌ అణువులోకి చేరి (O3) ఆక్సీజన్‌ పరమాణువులుగా మారి ఓజోన్‌ అణువవుతుంది.

*☔ఓజోన్‌ లాభ నష్టాలు☔*

🌧వాతావరణపు గాలి పొరలో (భూ ఉపరితలానికి సుమారుగా 15 - 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది) ఓజోన్‌ సహజంగా ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలను భూమి పైకి రాకుండా అడ్డుకొని జీవరాశిని రక్షిస్తుంది. వాహనాల కాలుష్యం నైట్రోజన్‌ ఆక్సైడ్‌ల హైడ్రో కార్బన్‌ల స్థాయిలు పెరగడం వల్ల వాతావరణపు పైపొర భూఉపరితలానికి దగ్గర అయింది. సూర్యరశ్మిలో ఈ రసాయనాలు ఓజోన్‌గా మారతాయి. దగ్గు, గొంతు నొప్పి, ఉబ్బసవ్యాధిని పెంచడం శ్వాస కోశ వ్యాధులు మొదలగు సమస్యలను ఈ ఓజోన్‌ కల్గిస్తుంది. పంటలను కూడ నాశనం చేస్తుంది. వాతావరణపు గాలి పొరలో గల ఓజోన్‌ భూమిపై నున్న జీవరాశిని సూర్యుని నుండి వచ్చే అతినీలలో హిత కిరణాల నుండి రక్షిస్తుంది.

⛈వాతావరణానికి దిగువున ఉన్న ఓజోన్‌ ఆరోగ్య సమస్యలను కల్గిస్తుంది.

🌩ఓజోన్‌ తరిగిపోవడమంటే ఏమిటి?క్లోరో ప్లూరో కార్బన్‌లు (CFCs) ఓజోన్‌ తరుగుదలకు ప్రాథమికరసాయనాలు .రిఫ్రిజరేటర్లలో ఎయిర్‌ కండీషన్‌ మొదలగు వాటిలో రిఫ్రిజెంట్లుగా ఉంటాయి.ఇవి క్లోరీన్‌ను కల్గి ఉంటాయి.రెండవ దశః సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు సి.ఎఫ్‌.సిని విచ్చిన్నం చేసి క్లోరీన్‌ని విడుదల చేస్తాయి.మూడవ దశః ఈ క్లోరీన్‌ పరమాణువులు ఓజోన్‌ అణువును విచ్చిన్నం చేసి ఓజోన్‌ తరిగి పోయేటట్లు చేస్తాయి.

*🌪ఓజోన్‌ తరిగి పోవడం వల్ల మన పై ప్రభావం ఎలా ఉంటుంది ?🌪*

💦ఓజోన్‌ పొర తరిగి పోవడం వల్ల అతి నీల లోహిత కిరణాలు భూమిని తాకడం అధికం అవుతుంది. దీని వల్ల జన్యువులు, కళ్ళు దెబ్బ తినడంతో పాటు సముద్ర జీవరాశి పై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.

01/09/2016
ఈ రోజు ఆదివారం అంటె దాదాపుగా అందరు ఎంజాయ్ చేసె రోజు . వారం అంతా కష్టపడి రెస్ట్ తీసుకునే వారు కొందరు. సినీమాలకీ , షికార్ల...
14/08/2016

ఈ రోజు ఆదివారం అంటె దాదాపుగా అందరు ఎంజాయ్ చేసె రోజు . వారం అంతా కష్టపడి రెస్ట్ తీసుకునే వారు కొందరు. సినీమాలకీ , షికార్లకి వెళ్లే వారు కొందరు . పబ్ లకి ,క్లబ్ లకి కొందరు ,పార్కులకి కొందరు, తాగడానికి , కొందరు, రెస్టారెంట్ లకి కొందరు, షాపింగ్ మాల్ కి కొందరు , చికెన్ ,మటన్ , చేపలు , రొయ్యలు, పీతలు ,బిర్యానీ లు ,పలావ్ లు ,
అబ్బో చాలా అంటె చాలా ఎంజాయ్ చేస్తారు చాలా మంది .

చెయ్యండి ...మీ డబ్బు మీ ఇష్టం కానీ ఒక్క సారి ఒక్కపూట కుడా తిండి లేని పేద వారికోసం ఆలోచించండి . ఒంటి మీద గుడ్డ లేకుండా తిరిగే బీద వారి కోసం అలోచించండి. మీకు తోచినంతలోనే సహాయపడండి. వారి ఆకలి తీర్చండి.

అందరికి కాదు కష్టం చేసే వయసు లేక , వయసు ఉన్నా అంగవైకల్యంతో ఉండేవారికి, గుడ్డి వారికి , ప్రమాదంలో పోగొట్టుకున్న శరీర భాగాల వారికి

మీకు తోచినంత సహయం చెయ్యండి. డబ్బులు ఇచ్చే బదులు కూడు ,గుడ్డ ఇస్తే ఇంకా మంచిది ....సహయం చేస్తే అందులో ఉన్న అనందమే వేరు ...

నాది కుడా మధ్యతరగతి కుటుంబమే . అయినా ఉన్న దాంట్లోనే సహయం చేస్తా . సహాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు మంచి మనసు అని మదర్ థెరిస్సా చెప్పింది.

డబ్బు శాశ్వతం కాదు అంటారు చాలా మంది . కాని డబ్బే శాశ్వతం మనుషులు కాదు . మనిషికే చావు డబ్బుకి కాదు .....

like ల కోసమో , commont ల కోసమో కాదు ఈ పోస్టు చేసింది... నేటి కాలం లో బుక్ ల కంటే ఫేసుబుక్ లోనే ఎక్కువ ఉంటున్నారు . చదివి స్పందిస్తారని ఆశతో ......

ఇట్లు ,

ప్రేమతో ,

మీ చంద్రశేఖర్ ఇండియన్...

24/07/2016
16/07/2016

అవినీతిని ఎంతవరకు సహించవచ్చు...

మనం అవినీతి సమాజంలో నివసిస్తున్నాం. ఎవరినయినా అవినీతి పరుడివి అంటే వెంటనే నీవు పెద్ద నీతి పరుడివా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్న సమాజంలో బతుకుతున్నాం. బతుకడం కోసం చిన్న చిన్న స్థాయిలలో అవినీతి ఉందంటే కడుపాకలి అని సరిపెట్టుకోవచ్చు. కాని ప్రసుత్తం జరిగిన లేదా జరుగుతున్న అవినీతి మొత్తం సమాజాన్నే కలుషితం చేసే విధంగా ఉంది. బతుకడం కోసం కొందరు మహిళలు శరీరాలు అమ్నుకొంటున్నారని అనుకుందాం అది తప్పని సరైన స్థితిలో వారుచేస్తున్నవిగా అర్థం చేసుకుని పునరావాసం కల్పించడమో లేక చూసిచూడనట్లు ఉండడమో జరుగుతోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన తారా చౌదరి లాంటి వారు అంతకు మించి పోయారు. పడుపు వృత్తితో పాటు బ్లాక్ మెయిల్ చేయడం, అమ్మాయిలను అడ్డదారులు త్రొక్కించడం లాంటి పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అయినా చాలా మంది రాజకీయ నాయకులు ఎలా ఆ అమ్మాయిని ఈ రంగంలో ఉపయోగించుకున్నారనే విషయాన్ని చర్చించుకుని యోవగించుకున్నారు. టి.వి ఛానళ్లు తారా చౌదరిని పదే పదే చూపుతుంటే ఎగబడి చూసిన జనమూ ఉన్నారు. ఆమెను అరెస్టు చేసినప్పుడు ఎలాంటి భయం లేకుండా పెద్ద ఘనకార్యం చేసినట్టుగానే పోజులు ఇచ్చింది. ఇదే విధంగా అవినీతి చిన్న స్థాయిలో ఉండి బతుకడానికి చేస్తున్నదయిచే కొంత వరకు క్షమించవచ్చు లేదా అర్థం చేసుకోవచ్చు. అన్నీ ఉండి, ప్రజలు నమ్మకంతో కట్టబెట్టిన అధికారాన్ని అమ్ముకుని కోట్లు కూడేసుకున్న పెద్ద మనుషులకు తారా చౌదరికి పెద్ద తేడాలు లేవు. దీని పై అడ్డంగా వాదించే వారు అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టే . మనకు తోచిన స్థాయిలో మనం అవినీతికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడితే అదే పెద్ద ఉద్యమంగా మారగలదు. అన్న హజారే ఈ విషయమై చేసిన ఉద్యమం జాతి యావత్తు ఒక్క తాటిపై నిలిపింది. అవినీతికి వ్యతిరేకంగా ఎవరయినా మాట్లాడితే వారు చేయలేదా , వీరు చేయలేదా అని ప్రశ్నించకుండా అవినీతిని రూపుమాపేందుకు మన వంతు ప్రయత్నం చేద్దాం. అది రాజకీయమైనా ఇంకో స్థలమయినా చివరికి ఆ భారం పడేది సామాన్యులపైననే అని వివరిద్దాం.

Address

Anantapuramu

Alerts

Be the first to know and let us send you an email when Chandra Sekhar Indian posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share