NarendraBabu

NarendraBabu NARENDRA BABU RP REAL ESTATE SOCIAL MEDIA DIGITAL MARKETING HYDERABAD

మనకు ప్రతి బ్యాంకు ఎకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు తప్పక పూర్తిగా చూడవలసిన లేదా కనీసం వినవలసిన వీడియో ఇది. కనుక ఈ వీడియో చూడడం&...
18/11/2025

మనకు ప్రతి బ్యాంకు ఎకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు తప్పక
పూర్తిగా చూడవలసిన లేదా కనీసం వినవలసిన వీడియో
ఇది. కనుక ఈ వీడియో చూడడం&వినటం మిస్ అవ్వకండి... ✍️🤷‍♂️

మనకు ప్రతి బ్యాంకు ఎకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు తప్పక పూర్తిగా చూడవలసిన లేదా కనీసం వినవలసిన వీడియో ఇది.కనుక ఈ వీడియ....

23/10/2025

కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి? విధానాలు తెలుసుకుందా..!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం కానీ ఈసారి మనకు ఒకరోజు లేటుగా మొదలైంది సోమవారం దీపావళి బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.

🌿న కార్తీక సమో మాసో
న శాస్త్రం నిగమాత్పరమ్ |
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః||

🌸అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.

🌷 ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం. 🌷

🌿కార్తీక శుద్ధ పాడ్యమి :
తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.

🌸విదియ :
సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.

🌿తదియ :
అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.

🌸చవితి :
నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.

🌿పంచమి :
దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.

🌸షష్ఠి :
ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.

🌿సప్తమి :
ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.

🌸అష్టమి :
ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.

🌿నవమి :
నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

🌸దశమి :
నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.

🌿ఏకాదశి :
దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.

🌸ద్వాదశి :
ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.

🌿త్రయోదశి :
సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.

🌸చతుర్దశి :
పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

🌿కార్తీక పూర్ణిమ :
కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.

🌸కార్తీక బహుళ పాడ్యమి :
ఆకుకూర దానం చేస్తే మంచిది.

🌿విదియ :
వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.

🌸తదియ :
పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.

🌿చవితి :
రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.

🌸పంచమి :
చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.

🌿షష్ఠి :
గ్రామదేవతలకు పూజ చేయాలి.

🌸సప్తమి :
జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.

🌿అష్టమి :
కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.

🌸నవమి :
వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.

🌿దశమి :
అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.

🌸ఏకాదశి :
విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

🌿ద్వాదశి :
అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.

🌸త్రయోదశి :
ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.

🌿చతుర్దశి :
ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.

🌸అమావాస్య :
పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి..స్వస్తి..🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

మహారాజ రాజశ్రీ గౌరవనీయులైన *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.సి.సంక్షేమ,చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్. సవితమ్మ అక్క గా...
01/09/2025

మహారాజ రాజశ్రీ గౌరవనీయులైన
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.సి.సంక్షేమ,చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్. సవితమ్మ అక్క గారికి దివ్యసముఖమునకు.*
అమరావతి, ఆంద్రప్రదేశ్ రాష్ట్రం.

*విషయము::---* ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రేటర్ రాయలసీమ ప్రాంతం లోని ఈడిగ కులస్తులకు ప్రభుత్వం నుండి రావలసిన రాయితీలు రిజర్వేషన్లు కోల్పోతున్న రాజకీయంగా ఆర్థికంగా వ్యాపార పరంగా వెనుకబడి పోతున్న ఈడిగ కులస్తులకు జరుగుతున్న అన్యాయాలపై సమర్పిస్తున్న వినతి పత్రం.

*అయ్యా!*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రేటర్ రాయలసీమలో ఉండే ఈడిగ కులస్తుల కుల ధ్రువీకరణ పత్రంలో వెబ్ సైట్ లో ఈ విధముగా వస్తున్నది గౌడ్ (ఈడిగ) కనుక ప్రభుత్వం నుండి రావలసిన రాయితీలు రిజర్వేషన్లు కోల్పోతున్న రాజకీయంగా ఆర్థికంగా వ్యాపార పరంగా వెనుక బడి పోతున్న ఈడిగ కులస్తులకు ఈ విధముగా గతంలో అయితే ముందుగా ఈడిగ (గౌడ్) మార్చవలెనని ఈ విషయాన్ని క్షుణ్ణంగా మీ ముందు ఉంచుతున్నాము. మీకు పూర్తి వివరాలు ఈ క్రింద మేము వివరిస్తున్నాము. మీరు క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం.

*ముఖ్య గమనిక:-* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రేటర్ రాయలసీమ ప్రాంతం లోని ఈడిగ కులస్తులకు జరుగుతున్న అన్యాయాలపై కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాము...👇👇👇

👉[𝟎𝟏].జీవో నెంబర్ 𝟏𝟔 ప్రకారం *[ 𝟏.ఈడిగ 𝟐.గౌడ 𝟑.శ్రీశయన 𝟒.శెట్టిబలిజ 𝟓.యాత ]* కులాలను *శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారు* పై కులాలను 𝟎𝟓 అన్నింటినీ కలిపి ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి *గీత కులాల కార్పొరేషన్* ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తద్వారా గీత కులస్తులను సంఘటితం చేసి గీత కులస్తులను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వృద్ధి చెందాలని వీటిని𝟎𝟓అన్నింటిని కలిపి గీత కులాలుగా గుర్తించడం జరిగింది. కానీ అనేక విషయాల్లో ఈడిగ కులస్తులు వివక్ష కు గురి కావడం జరిగింది.

👉[𝟎𝟐].ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమా జిల్లాలతో పాటు ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలలో ఉన్న ఈడిగ కులస్తులు దాదాపు 𝟏𝟎 నుంచి 𝟏𝟐 లక్షల గలరు అని తెలియజేస్తున్నాము.

👉[𝟎𝟑].ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇటీవల మంజూరు చేసిన మద్యం దుకాణాలలో గౌడులతోపాటు ఈడీగ కులస్తులకు సరి సమాన వాటా ఇచ్చినప్పటికీ. రాయలసీమలో కేవలం ఈడిగలు ఉన్నప్పటికీ మద్యం టెండర్ల విషయంలో రాయలసీమలో గౌడ్ గమాన్లు అని చూపడం జరిగింద.

👉[𝟎𝟒].ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కానీ అనేక విషయాలలో ఈడిగలకు [ *రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా* ] దాదాపు 𝟏𝟎 నుంచి 𝟏𝟐 లక్షలు పైఉన్న ఈడీగ కులస్తులు ఎలాంటి రాజకీయ పదవులు కానీ మరియు ఇతర ఉన్నత పదవులు కానీ రాకుండా గీతకులాల్లోని ఉపకులాలు వలన ఎలాంటి ఉన్నత పదవులు రాకుండా ఈడిగ కులస్తులకు అన్యాయం జరుగుతున్నది.

👉[𝟎𝟓].ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి గీత కులాలు 𝟏𝟐% నుండి 𝟏𝟓% ఉన్నప్పటికీ రాయలసీమలో 𝟏𝟎 నుంచి 𝟏𝟐 లక్షలు పైఉన్న ఈడిగ కులస్తులకు ఎలాంటి ఉన్నత పదవులు రాకుండా అన్యాయం జరుగుతున్నది. అలాగే రాయలసీమ లో మూడు నాలుగు శాతం ఉన్న కులస్తులకు వస్తున్న ఉన్నత పదవులు ఈడిగలు విషయం వచ్చేసరికి అనేక వివక్షకు గురి అవుతున్నారు అని తెలియజేస్తున్నాము.

👉[𝟎𝟔].ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కుల గణన తో పాటు జనగణన చేపడుతున్న సందర్భంలో ఈడిగలను ప్రత్యేకంగా లెక్కించి ఈడిగ కులస్తులకు రానున్న రోజుల్లో రాజకీయ ప్రాధాన్యత కల్పించి రాయలసీమలో 𝟎𝟔 అసెంబ్లీ స్థానాలు 𝟎𝟑 పార్లమెంటు స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించవలసిందిగా కోరుచున్నాము.

👉[𝟎𝟕].ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గీత కులస్తులు జీవో నెంబర్ 𝟏𝟔 ప్రకారము *[ 𝟏.ఈడిగ 𝟐.గౌడ 𝟑.శెట్టిబలిజ 𝟒.శ్రీశయన 𝟓.యాత ]* కులాలు ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం లో కార్పొరేషన్ 𝟎𝟐 *𝟎𝟏].గౌడ కార్పొరేషన్ 𝟎𝟐].శెట్టిబలిజ కార్పొరేషన్* మాత్రమే ఏర్పాటు చేసి మిగతా కులాలకు ఏర్పాటు చేయకపోవడం జరిగింది. ఈ విధంగా కూడా కులస్తులకు అన్యాయం జరగడం జరిగింది.

👉[𝟎𝟖].ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా *𝟏].ఈడిగ 𝟐].శ్రీశయన 𝟑].యాత* కులాలకు వెంటనే కార్పొరేషన్ లు ఏర్పాటు చేయాలి. అని *గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.సి.సంక్షేమ,చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవితమ్మ అక్క గారికి* మనవి చేసుకొనుచున్నాము.

👉[𝟎𝟗].ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం వారు కుల గణన కోసం గెజిట్ నెంబర్
👉 𝟏𝟎𝟗 శెట్టిబలిజల కోసం
👉 𝟏𝟏𝟏 శ్రీశయన కులస్తుల కోసం
👉 𝟏𝟏𝟎 గౌడ్ మరియు (ఈడిగ) కులస్తులను కలిపి లెక్కించటానికి గెజిట్ విడుదల చేయడం జరిగింది కావున
గౌడ (ఈడిగ) లు కాకుండా
ఈడిగ కులస్తుల్ని ప్రత్యేకంగా లెక్కించవలసిందిగా కోరుచున్నాము.

👉[𝟏𝟎].ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈడిగ (గౌడ) కులస్తులపైన వేరే వాళ్ళు పెత్తనం లేకుండా చూడాలని రిక్వెస్ట్ గా మిమ్మల్ని కోరుకొనుచున్నాము.

పై తెలిపిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి మా ఈడిగ (గౌడ) కులస్తుల మీద దయ ఉంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాకు దక్కాల్సిన హక్కులు ప్రభుత్వం నుండి రావలసిన రాయితీలు రిజర్వేషన్లు కోల్పోతున్న రాజకీయంగా ఆర్థికంగా వ్యాపార పరంగా వెనుకబడి పోతున్న ఈడిగ కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత వచ్చేలా చూడవలెనని మిమ్మలను ఈడిగ (గౌడ) కులస్తులు కోరుకొనుచున్నాము.

కృతజ్ఞలతో....
*"ఇట్లు"*
*ఈడిగ (గౌడ) సంక్షేమ సంఘం*
*శ్రీ సత్య సాయి జిల్లా*

01/09/2025

Address

Hindupur
Penukonda

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919494433292

Alerts

Be the first to know and let us send you an email when NarendraBabu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share