Legal DIG & Co

Legal DIG & Co Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Legal DIG & Co, Legal Service, Kamalapuri Colony, Hyderabad.

20/08/2023

ఏ వ్యక్తి అయినా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అతడిని అర్హత కలిగిన పోలీస్ అధికారి నిర్భందించవచ్చు. కానీ అప్పుడప్పుడు సరయిన కారణాలు లేకుండానే ఒక వ్యక్తిని నిర్భందించడం లేదా అరెస్ట్ చేయడం జరుగుతుంది.
ఈ విధంగా వ్యక్తిని నిర్భందించడం సహేతుకమా, కాదా అని న్యాయస్థానం విచారిస్తుంది. ఈ విధమైన నిర్భందం నుండి వ్యక్తిని రక్షించడానికి న్యాయస్థానం జారీ చేసే ప్రత్యేక ఉత్తర్వును “ హెబియస్ కార్పస్” అని అంటారు.
అర్థం ఏంటంటే?
“హెబియస్ కార్పస్” లాటిన్ పదం. దీనర్థం “Have the body” అంటే శరీరాన్ని చూపించమని అర్ధం. అంటే నిర్భందించిన వ్యక్తిని న్యాయ స్తానానికి తీసుకు రావాలని అర్థం. ఈ హెబియస్ కార్పస్ రిట్ లోని ఆదేశం ప్రకారం.. నిర్భందించిన వ్యక్తిని సదరు అధికారి వెంటనే కోర్టులో హాజరు పరచాలి. అలాగే నిర్భందించడానికి గల కారణాలను న్యాయస్థానానికి వివరించాలి. ఆ వివరణలు సరిగ్గా లేకపోతే న్యాయస్థానం నిర్భందించిన వ్యక్తిని విడుదల చేస్తుంది. సరయినవైతే చట్టం పరిధిలో వ్యవహరించడానికి ఆర్డర్ ఇస్తుంది.

ఎప్పుడు రిట్ వేయాలి
ఆర్టికల్ 19 నుంచి 22 వరకు పొందుపర్చిన వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు మాత్రమే ఈ హెబియస్ కార్పస్ రిట్‌ను జారీ చేయడం జరుగుతుంది. అరెస్ట్‌ చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప న్యాయస్థానంలో హాజరుపర్చకపోతే, ఈ రిట్‌ దాఖలు చేస్తే వెంటనే ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపర్చాలని కోర్టు ఆదేశిస్తుంది.

రిట్ ఎవరూ వేయొచ్చు
హెబియస్ కార్పస్ రిట్ ప్రధాన ఉద్దేశం వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ, చట్ట వ్యతిరేకంగా ఏ వ్యక్తినీ నిర్బంధించకుండా, శిక్షించకుండా కాపాడటమే. ఈ రిట్‌ను ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు కూడా జారీ చేసే అధికారం కోర్టులకు ఉంటుంది. మూడో వ్యక్తి కూడా ఇందులో జోక్యం చేసుకొనే హక్కు ఉంటుంది. బాధితుల తరఫున సామాజిక స్పృహ ఉన్న సంస్థ లేదా వ్యక్తి ఈ రిట్‌ దాఖలు చేయొచ్చు. అందుకే దీన్ని ‘వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం’ అని కూడా అంటారు..

Warm Regards :

Legal Dig & Co

9440457857

20/08/2023

న్యాయ నిపుణులను ఎప్పుడు సంప్రదించాలి...

అమ్మకం,కొనుగోలు

1. స్తిరాస్థి అనగా స్థలాలు, పొలాలు, ఇళ్లు, షాపులు, గోడౌనులు మొదలైనవి. అమ్మాలన్నా, కొనాలన్నా, గిష్టు ఇవ్వాలన్నా, భాగపంపిణి చేసుకునేటప్పుడు, వీలునామా వ్రాసేటప్పుడు, వీలునామా అమలుకొరకు, మరియు అద్దె, లీజు, తాకట్టు వగైరాల విషయంలో అగ్రిమెంట్లు, దస్తావేజులు వ్రాయుట మరియు పరిశీలించి న్యాయ సలహా కోసం.......

2. నగదు అప్పులు ఇచ్చుట, వసూలు చేసుకునుట, హామీ ఉండుట, చేబదులు ఇచ్చుట ఇతర లావాదేవీలు ఏమైనా ముందుగా గాని, తర్వాత గానీ, భవష్యత్తు జాగ్రత్తకై న్యాయ సలహా కోసం......

ప్రభుత్వ కార్యాలయాల్లో

3. రెవిన్యూ, రిజిష్టారు, తహసీల్దారు. గ్రామ పంచాయితీ మరియు ఏ ప్రభుత్వ కార్యమునకు సంబంధించిన లేదా అధికారి వారికి సంబంధించిన విషయము గురించి లేదా సమస్య గురించి న్యాయ సలహా కోసం......

4. నూతన వ్యాపార, వ్యవస్థాపక కార్యక్రమాల కై అగ్రిమెంట్లు, అర్జీలు, పర్మిషన్లు గురించి సమస్యలు లేదా సలహాలకై మరియు పెట్టుబడుల లావాదేవీలు గురించి భవష్యత్తు విధివిధానాల న్యాయ సలహా కోసం......

5. అన్ని సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇతర కోర్టు వివాదాలలో వాదించుటకు....

6. మన రాజ్యాంగ ప్రాధమిక హక్కుల పరిరక్షణ, పర్యావరణ మరియు పరిసరాల, ప్రజా ఆరోగ్య, వనరుల
వినియోగము వాటికై హక్కలు, బాధ్యతల న్యాయ సలహాల కోసం
మరియు వ్యవసాయ, విహాహ, విద్యా, విదేశీయాన, ఉద్యోగ తదితర విషయాలపై కూడా న్యాయ సలహాలకై న్యాయవాదులను సంప్రదించటం మంచిది.

నోట్:-
న్యాయ సేవలు ఇచ్చేటప్పుడు లాయర్ నీ అన్ని విషయాలు అడిగి తెల్సుకోవటం కొంత మేర మి సమస్యలు కోర్టు వరకు వెళ్లకుండా అపుకోవచ్చు, కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్న న్యాయవాది నీ సంప్రదించడం ఉత్తమం...

Warm Regards :

Legal Dig & Co

9440457857

Address

Kamalapuri Colony
Hyderabad
500073

Telephone

+919966704704

Website

Alerts

Be the first to know and let us send you an email when Legal DIG & Co posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category