PHRA 1969

PHRA 1969 I love India and devotional and my self (Facebook లొ నేను పెట్టే సమాచారం కేవలం నా వ్యక్తిగతం )

Photo
30/09/2022

Photo

25/09/2022

_*వేమన శతకం*_
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

వేయి విధములమర వేమన పద్యముల్
అర్థమిచ్చువాని నరసి చూడ
చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు
విశ్వదాభిరామ వినురవేమ

*భావం:-*

ఈ పద్యం వేమన్న పద్యాల్లో ఉన్నా వేమన్న పద్యాల గురించి ఇది లోకంలోని వాడుక అయి ఉంటుంది. బ్రౌన్ కూడా ‘వేయి విధములను’ Thousand interpretations అన్నాడు.'చూడ చూడ బుట్టు చోద్యమౌ జ్ఞానంబు'ను If thou think on these, this shall produce refined wisdom in thee అని వ్యాఖ్యానించాడు. ఈ లక్షణం వల్ల వేమన విలక్షణమైన మహాకవిగా, విశిష్టమైన ప్రజాయోగిగా విలసిల్లుతున్నాడని భావించవచ్చు.

‘మేడపైనా అలపైడి బొమ్మ/ నీడనే చిలకమ్మా’ అన్నాడు దేవదాసులో సినీకవి. దీనిని ఆ రోజుల్లో తాగుబోతు వ్యక్తావ్యక్తాలాపనగా భావించేవారు. కొందరు వేదాంతార్థాల్ని కూడా వెతికేవారు. తరువాత ఎప్పుడో సీనియర్ సముద్రాల ఎక్కడో మాట్లాడుతూ ‘మేడపైన అలపైడి బొమ్మ’ అంటే పార్వతి అనీ, ‘నీడలో చిలకమ్మా’ అంటే చంద్రముఖి అని కథాపరంగా గుట్టు విప్పాడు. అవాంతర సందర్భంగా ఈ ప్రసక్తిని ఇక్కడ తీసుకొచ్చాడు.

ఇక వేమన పద్యంలో ‘మేడ’ ఏమిటి? మానవ శరీరమా? అయితే ‘మెచ్చుల పడుచు’ నాలుక కావాలి. నాలుక పలుకునకు ప్రతీక గదా! మంచి వాక్కుల్లో మంచి భావమే ఉంటుంది. ఆ భావమే మోక్షానికి సాధనమవుతుంది.

లేదా మేడ ఆకాశం కావొచ్చు. ఆకాశానికి శబ్ద గుణముంటుంది. మేఘధ్వని శబ్దమే. దీని గురించి వేదాల్లో కూడా వర్ణన ఉంది. మేఘాల్లోని మెరుపే మెచ్చుల పడుచు. భాషా వాఙ్మయమే భావం. ఆ భావం నుండే పరలోకానుభవం కలుగుతుంది. ఇలా ఒకటి రెండు ప్రయత్నాలు. అప్పటివరకు దీని గురించి అసలు సారాంశం చెప్పగలిగే జ్ఞాని కోసం ఎదురుచూద్దాం.
🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵

25/09/2022

🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
ఓం నమః శివాయః ఓం నమః శివాయః
ఓం నమః శివాయః ఓం నమః శివాయః
ఓం నమః శివాయః ఓం నమః శివాయః
ఓం నమః శివాయః ఓం నమః శివాయః
ఓం నమః శివాయః ఓం నమః శివాయః
🙏🌺🌼☘️🔱ఓం నమః శివాయః...
హర హర మహాదేవ శంభో శంకర...
పాహిమాం... పాహిమాం...
రక్షమాం... రక్షమాం...🔱☘️🌼🌺🙏
🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

25/09/2022

🌷ఋణానుబంధము..!!🌷

🌸తెలిసి తెలియక చేసే తప్పులు కూడా బంధాలు అవుతాయి...

🌸ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా,
మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు.

🌸ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే దూర మవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే , మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే...

🌸మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి , ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.

🌸ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలో మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.
మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసే వారిగా ఎదురవుతారు.

🌸మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులు గానో, సహాయకులు గానో ఎదురవుతారు.

🌷ఉదాహరణకు ఒక జరిగిన కథ..🌷

🌷కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు.

🌸ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచ లోనూ పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయం లో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.

🌸తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు. ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు.

🌸అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను బాధలు పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అని.. అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ...

🌸ఒకసారి మహర్షి బస చేసిన అతిథిగృహం బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని.

🌸ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు. అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి...

🌸ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే,
ఆయన వెనక్కి పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే, పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు.

🌸 అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తె వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు. ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో,

🌸 గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించిన వన్నీ కర్మ బంధాలయి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం,

🌸 ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.
అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాలో చిక్కుకుపోతుంటాము.
ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం.

🌸అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.

25/09/2022

🌼🌿🐄🌼🌿🌼🐄🌿🌼🐄🌿🌼🐄🌿🌼🐄🌿🌼🐄🌿

*ఇంట్లో కామధేను విగ్రహం- వాస్తు ప్రాముఖ్యత*

ఆవు మరియు దూడకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మనము ఆవును కామధేనుగా ఆరాధిస్తాము. ఆవు మరియు దూడ విగ్రహాన్ని ఆరాధించడం మీ కోరికలన్నింటినీ తీర్చగలదని నమ్ముతారు. కాబట్టి ఇంట్లో కామధేను విగ్రహం ఉంచడం చాలా మంచిది.

కామధేను దైవిక లక్షణాల తల్లిగా పరిగణించబడుతుంది మరియు భూమి దేవతగా(భూదేవి) చెప్పబడుతుంది. కామధేను విగ్రహం శ్రేయస్సు మరియు ఆప్యాయతలకు చిహ్నం. తల్లికి తన బిడ్డ పట్ల ఉన్న ప్రేమలాగే.

కామధేను ఆవు బొమ్మ మార్కెట్లో వివిధ లోహాలలో లభిస్తుంది. మెటల్ ప్లేట్ ఉన్న పురాతన సున్నపురాయి కూడా మార్కెట్లో లభిస్తుంది. ఆరాధనకోసం దీన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఇందులో రాగి లేదా ఇత్తడి పూతతో తయారుచేయబడి ఉంటాయి. ఇది ఇంటి డెకరెషన్ పెంచడంలో కూడా సహాయపడుతుంది.

కామధేను విగ్రహంలో వైట్ మెటల్ మరియు సిల్వర్ ఫినిషింగ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది మీ బడ్జెట్ మరియు మీ ఎంపికను బట్టి కొనుగోలు చేయవచ్చు. చేతితో తయారు చేసిన హస్తకళలను భగవంతుడు మరియు దేవత ఆధ్యాత్మిక ఆరాధన కోసం ఉపయోగిస్తారు.

ఈ కామధేను విగ్రహాన్ని కార్యాలయం, ఇల్లు, దుకాణాలు, పారిశ్రామిక మరియు వాణిజ్య ప్రదేశంలో ఉంచవచ్చు.
మీ ఆదాయంతో పోలిస్తే మీ ఇంటి వ్యయం ఎక్కువగా ఉంటే, ఏదైనా సోమవారం ఉదయం 4.30 నుండి సాయంత్రం 6 గంటల మధ్య మీ ఇంటి నైరుతి మూలలో ఉంచండి. ఈ ముహూర్త బ్రహ్మ ముహూర్తం అంటారు. మీరు క్రమం తప్పకుండా గులాబీ నీరు మరియు పాలతో పూజించండి.
శుక్రవారాలలో కూడా ఆరాధన చేయవచ్చు. మీరు మీ ఇంటిలో సుఖంగా లేరని మరియు మీ జీవితంలో మీరు విజయం సాధించలేరని భావిస్తే, కామధేను మీ ఇల్లు మరియు కార్యాలయంలో ఉంచండి.

కామధేను ఆవు మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది. కామధేను ఆవును విజయం మరియు సంపద కోసం ఉపయోగించవచ్చు.
విగ్రహాన్ని ఉంచడం వలన
మీ ఇంట్లో శాంతిని కలిగిస్తుంది.
కామధేను ఆవు మీ వ్యాపారం వృద్ధి కొరకు సహాయపడుతుంది. ఇది విద్యకు చాలా సహాయపడుతుంది. మీ సంతానం ప్రత్యేక విజయాన్ని సాధిస్తారు.

25/09/2022

తిలోత్తమ అనే పేరు రావడానికి కారణము ?..............................................................

(౧) సినీవాలి - సినీవాలి లోని సినీ అంటే చిన్నవంక (ర), వాలీ అంటే కీర్తిగలది. చందమామ చిన్న వంక వున్నప్పుడు కూడా అందంగానే వుంటాడు. ఇలా చిన్న వంక (ర) వుండడం వలన చంద్రుడా రోజు ఎంతో ప్రశస్తమైనవాడు పూజనీయుడు కూడా.

సినీవాలీ ఓ స్త్రీ పేరు కూడా. ఈమె ధాత అనే అప్సరుడి భార్య.

(౨) సింహిక- రామాయణంలో సింహిక ఒక రాక్షసి, ఈమెకు గల మరోపేరు ఛాయగ్రాహిణి, సముద్రగర్భం పైన ఎగురుతున్న జీవుల నీడను లాగి అసలైన జీవులను పట్టేది. ఆంజనేయుడి నీడనులాగి హనుమ కాయాన్ని మింగాలని ప్రయత్నించినపుడు మారుతి ఆమెలో ప్రవేశించి ఆ రాక్షసి పొట్టను చీల్చుకొని బయటపడ్డాడు.
సింహిక - సింహిక పేరుతో హిరణ్యకశ్యపునికి ఓ కూతురుంది.

(౩) సుందోపసందులు - హిరణ్యకశ్యపుని వంశములోని వారు, వీరి తండ్రి నికుంభుడు. అన్నదమ్ములిద్దరు చాలా అన్యోన్యంగా కలిసిమెలసి వుండేవారు. ఎంతగానంటే ఇద్దరి పేర్లను కలిపి సుందోపసుందులుగా పిలిచేవారు. బ్రహ్మవరము చేత కామరూపవిద్య ( కోరినరూపంలోనికి ప్రవేశించడము), కామరూపగమనము (అదృశ్యరూపంలో చరించడం ) అనేక మాయశక్తులు పొందారు, ఇంకా ఇతరులచే మరణం లేకుండా వుండే వరము కూడా పొందారు. వరగర్వము చేత లోకకంటకులైనారు. లోకులు విష్ణువు శరణువేడారు. వారు అన్యులచే చావు లేకుండా వరం పొందారు కాని తమలో తాము కలహిస్తే మరణిస్తారని కనుక వారిలో వారు కొట్టుకోవడానికి ఓ అందాలసుందరిని సృష్టించమని విష్ణువు విశ్వకర్మను ఆదేశించాడు. విశ్వకర్మ తిలలు (నువ్వులు) అంతటి రత్నాల ఆమెలో పొదిగించి, దివ్యకాంతులను ఆమె శరీరంలో ప్రవేశపెట్టాడు, కనుక ఆ అందాలరాసిని తిలోత్తమ అని పిలిచారు. దేవతలు తిలోత్తమను అన్నదమ్ముల ఎదుట పడేలా చేశారు. తిలోత్తమ అందాలకు దాసులై ఆమెను పొందాలని తమలో తాము కలహించుకొని మరణించారు.

(౪) మత్స్యయంత్రాన్ని అర్జునుడు భేదించాడని మనకు తెలుసు. అదే విధంగా శ్రీకృష్ణుడు మద్రరాజు జరిపిన స్వయంవరంలో పాల్గొని మత్స్యయంత్రాన్ని చేధించి లక్షణను పెండ్లాడాడు. లక్షణశ్రీకృష్ణులకు ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే కొడుకులు కలిగారు.

(౫) పౌండ్రము - భీముడి శంఖము పేరు.

(౬) పురుషులలో మన్మథుడు, నలకుబరుడు, జయంతుడు అందాలరాసులు అపురూప సౌందర్యవంతులు. జయంతుడు ఇంద్రుని కొడుకు.

(౭) కిన్నరలు,కింపురుషులు - వీరు దేవతలలోనివారు, కిన్నరులు అశ్వముఖము మానవశరీరము కలిగివుంటారు. కింపురుషులు మానవముఖము అశ్వశరీరము కలిగివుంటారు.

(౮) ఏకలవ్యుడు - ఎంతమంచి విలుకాడైనప్పటికి బుద్ధి పెడదోవన బట్టింది, కుక్క ఇతనిని చూచి అరిచిందని కోపంతో దానినోట్లో ఏడు బాణాలు కొట్టినాడు. కోపాన్ని అదుపులో వుంచుకోనివాడు అధర్మము వైపు మొగ్గితే ప్రమాదమని తలచే ద్రోణుడు అతని బొటనవేలిని పొందాడు, అంతేకాని అర్జునుని ఎదురులేని విలుకాడుగా చేయడానికి మాత్రం కాదు. అనుకొన్నట్లుగానే ఏకలవ్యుడు కౌరవ బంధుగుడైన జరాసంధుని ప్రాపుచేరాడు,జరాసంధ శ్రీకృష్ణుల మధ్య జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడు
ఏకలవ్యుని వధించాడు.భారత సంగ్రామము కంటే ముందుగానే ఏకలవ్యుడు హతుడైనాడు.

( ౯) కుంతలదేశము - బళ్ళారి అనంతపుర జిల్లాలలోని కొన్ని ప్రాంతాలు.

(౧0) కాలకౌశికుడు - హరిశ్చంద్రుని సతి అయిన చంద్రమతిని దాసిగా చేసుకొన్న వారణాసిలోని బ్రాహ్మణుడు. విశ్వామిత్రుని కోరికచే కఠినాత్ముడిగా ప్రవర్తించాడు గాని స్వతహాగా ఉత్తముడు.

/సేకరణ/.......................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

Address

Balaji Colony

Alerts

Be the first to know and let us send you an email when PHRA 1969 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Law Practice?

Share